పిస్తా మంచి నాస్తా..

కాస్త ధర ఎక్కువే కానీ, అడపాదడపా చారెడంత పిస్తాపప్పు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలని చెబుతున్నారు నిపుణులు. ఫైబర్‌, ప్రొటీన్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండే పిస్తాను ఏ రూపంలో తీసుకున్నా మంచిదే అని సెలవిస్తున్నారు. రోజులో పది పిస్తాపప్పుల వరకు ఆరగిస్తే ఆరోగ్యం మెరుగవుతుందంటున్నారు.

పిస్తాపప్పులో ఉండే విటమిన్‌-బి6 హిమోగ్లోబిన్‌ను పెంచడంలో దోహదం చేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.

చర్మ సౌందర్యం ఇనుమడింపజేయడంలోనూ పిస్తా మంచి గుణం కనబరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్‌-ఇ.. చర్మానికి కాంతి తేవడంతో పాటు యువి కిరణాలను తట్టుకునే సామర్థ్యం కలిగిస్తుంది. స్కిన్‌ క్యాన్సర్‌ను నిలువరించే శక్తి దీనికి ఉంది.

విటమిన్‌-ఎ,ఇ పాళ్లు పిస్తాలో ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో వేడిని త్వరగా తగ్గిస్తాయి. నోరు పెచ్చడాన్ని పిస్తా త్వరగా అరికడుతుంది.

ఒబెసిటీ నుంచి కూడా పిస్తా రిలీ్‌ఫనిస్తుంది. ఆకలిని అరికట్టడంతో పాటు శరీరంలోని కొలెసా్ట్రల్‌ శాతాన్ని తగ్గిస్తుంది. ఎముకలు, కండరాల దృఢత్వాన్నీ పెంచుతుంది.

జీర్ణక్రియలో పిస్తా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇందులో సమృద్ధిగా ఉండే కాపర్‌, మ్యాంగనీస్‌, పాస్పరస్‌, థాయ్‌మైన్‌లు.. తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడతాయి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved