పిల్లలకు ప్లాస్టిక్ డబ్బాలో లంచ్ పెడుతున్నారా….?

స్కూల్స్ మొదలయ్యాయి బుక్స్, బ్యాగ్స్, లంచ్ బాక్స్ లు అని హడావిడి…. స్కూల్స్ వెళ్లే పిల్లలకు రంగు రంగుల ప్లాస్టిక్ డబ్బాల్లో అన్నం పెట్టి పంపుతుంటారు. అయితే వారి ఆహారం పట్ల జాగ్రత్త పడండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. ప్లాస్టిక్ డబ్బాల్లో అన్నం, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో నీరు ఇచ్చి పంపింపిస్తుంటారు. కాని వాటిని తప్పని సరి అనుకుంటే మాత్రమే హై క్వాలిటీ ప్లాస్టిక్ డబ్బాల్లో పిల్లలకు ఆహారం ఇచ్చి పంపించవచ్చు. అంతేకానీ తక్కువ ధరలకు అమ్మే నాణ్యత లోపం గల ప్లాస్టిక్ డబ్బాలలో ఆహారం ఇచ్చి పంపడం అంత మంచిది కాదని వైద్యులు అంటున్నారు. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఆహారం పెట్టగానే వేడికి మెల్ట్ కావడంతో పాటు రంగు కూడా ఆహారంలో కరిగి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందుచేత ప్లాస్టిక్ డబ్బాల ఎంపికలో పారెంట్స్ ఎక్కువ కేర్ తీసుకోవాలి

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved