పోలీస్ ఉద్యోగ అభ్యర్ధులు రన్నింగ్ ప్రారంభించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1) రానున్న రోజుల్లో పోలీస్ డిపార్టుమెంటులో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు ప్రాంతాల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. చాలామంది పోలీస్ జాబు కొట్టాలనే పట్టుదలతో రన్నింగ్ ప్రారంభిస్తారు. కానీ రన్నింగ్ ప్రారంభించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తమా , శ్వాస సమస్యలు ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా లేకుండా రన్నింగ్ చేయకూడదు. ఒక్కోసారి ప్రమాదానికి దారి తీస్తుంది.

2) మొదటి రోజు ఒకటే సారి అరగంట రన్నింగ్ చేయకూడదు. మోకాళ్ళ నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. మొదటి రోజు 5 నిమిషాలతో ప్రారంభించి , మెల్లగా రోజు రోజు రెండు నిముషాలు పెంచుకుంటూ రావాలి. రన్నింగ్ మద్యలో అలిసిపోయినప్పుడు వాటర్ త్రాగుతూ ఉండాలి.

3) రన్నింగ్ చేసాక, నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె వీలైతే కొంచెం వేడి చేసి , శరీరం మొత్తం పట్టించండి. ముఖ్యంగా కాళ్ళకి బలం చేకూరడానికి హిప్స్ నుండి పాదాల వరకు మృదువుగా మసాజ్ చేయండి. బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది.నొప్పులు ఉండవు. ఒక అరగంట ఆగి గోరువెచ్చని నీటితో స్నానం చేయండి.

4) ఇంక ఫుడ్ విషయానికి వస్తే సాద్యమైనంత వరకు బయటి ఫుడ్ మానేయాలి. వాటర్ ఎక్కువగా త్రాగాలి. ఆహారంలో పాలు , పెరుగు , గ్రుడ్లు , చేపలు , మటన్ , చికెన్ లెగ్స్ , సోయా బీన్స్ , డేట్స్ , ఆకుకూరలు , సీజన్లో వచ్చే పండ్లు , ముఖ్యంగా ఆరంజ్ , బెర్రీస్ , డ్రై ఫ్రూట్ , చిలకడ దుంపలు , క్యారట్ , బీట్ రూట్ , బీన్స్ , కాలీఫ్లవర్ తరచుగా తీసుకోవాలి.

5) పై విధంగా చేస్తే , అనుకున్న విజయం చేకూరుతుంది. మన ఆరోగ్యం - మన విజయం మన చేతుల్లో ఉంటుంది.

For more Info click here http://snehahastamsociety.org/useful-articles.php

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved