కొండకొనలు దాటి 15 కి.మీ నడిచి ఉద్యోగం నిర్వహిస్తున్న పోస్ట్ మ్యాన్ -

సీమాంద్ర కు వెళ్లాలంటే... ఉద్యోగులకు ఎన్నో సదుపాయాలు కల్పించాలి.. అయినా సరే.. అమరావతికి వెళ్ళి తమ ఉద్యోగ భాద్యతను నిర్వర్తించడానికి ఉద్యోగులు ఎన్ని కారణాలు చూపుతున్నారో తెలుసు.. ఎంత కష్టం మీద హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వెళ్లారు.. ఇలా తరలి వెళ్లడానికి ఉద్యోగుల గొంతెమ్మ కోరికలను ప్రభుత్వం నెరవేరుస్తూనే ఉన్నది.. కానీ శివన్ అనే ఓ పోస్ట్ మ్యాన్ తన ఉద్యోగం ఎంత బాధ్యతగా నిర్వర్తిస్తున్నాడో... తెలిస్తే.. మన వారిని ఏమనాలో ఎవరికీ అర్ధం కాదు.. శివన్ ఉత్తరాలను బట్వాడా చేసే క్రమంలో ప్రతి రోజూ యుద్దమే చేస్తాడు.. తన ప్రాణాలకు ప్రమాదం ఉన్నదని తెలిసినా ఉద్యోగాన్ని ఎంతో బాద్యతగా ఫీల్ అవుతూ.. తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తున్నాడు.. వివరాల్లోకి వెళ్తే...

శివన్ తమిళనాడులో కునూర్ అనే గ్రామంలో పోస్ట్ మ్యాన్ గా ఉద్యోగం చేస్తున్నాడు... కాగా తన ఊరికి 15 కి.మీ దూరంలో ఉన్న మరప్పలమ్, బులిరియార్ అనే కొండ ప్రాంతాల్లోని టీ ఎస్టేట్ కూడా వస్తాయి... అక్కడ కొంత మంది కార్మికులు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు... ఆ గ్రామాల్లోని ప్రజలకు వచ్చే ఉత్తరాలను, ఫించన్లను 15 కి.మీ నడిచి ఆ గ్రామానికి చేరుకొని ఉత్తరాలను ఇస్తాడు.. కాగా ఆ గ్రామానికి చేరుకోవడానికి ఎటువంటి బస్ లు కానీ మరే విధమైన సదుపాయాలు గానీ లేవు.. కేవలం కాలినడకనే కొండకోనలను దాటుకొంటూ వెళ్ళాడు శివన్... కాగా మార్గ మధ్యంలో ఎదురయ్యే ఏనుగులు, పాములు, ఎలుగుబంట్లను తప్పించుకొని మరీ తన ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు... శివన్.. ఓ సారి... శివన్ ఫించన్ ఇవ్వాల్సిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స తీసుకొంటున్నాడని తెలిసి... తన సొంత ఖర్చుతో ఆప్సత్రి వద్దకు వెళ్ళి.. అతని ఫించన్ ఇచ్చాడు.. కాగా తమ కోసం శివన్ ఎంతో కష్టపడి వస్తున్నాడని కార్మికులు శివన్ కు టీ ఇచ్చినా సరే... సున్నితంగా తిరస్కరిస్తాడట.... కాసిన్ని మంచినీరు ఇవ్వండి చాలు అని అడిగి మంచి నీరు తాగి వారి దగ్గర నుంచి సెలవు తీసుకొంటాడట...


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved