పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంధాలలో రచించి భద్రపరచారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన ముందే చెప్పారు..

ఇప్పటి వరకు జరిగినవిగా భావిస్తున్నవి:

 • * నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు (విద్యుత్ శక్తి) (నీటితో జనరేటరు)
 • * ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి. (యంత్ర వాహనాలు)
 • * కాశీ పట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది.
 • * ఒక అంబ (వితంతువు) 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. (ఇందిరా గాంధీ)
 • * తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. (ఎన్.టి.ఆర్, జయలలిత, ఎంజిఆర్ తదితరులు. చలన చిత్రాలు)
 • * రాచరికాలు,రాజుల పాలనా నశిస్తాయి. (ప్రజా ప్రభుత్వాలు)
 • * ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేకమంది మరణిస్తారు. (విమాన ప్రమాదాలు)
 • * జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది.
 • * బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి.
 • * దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమౌతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి.
 • * చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు.
 • * రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి.(శ్రీలంకలోని తీవ్రవాద పణామాలు)
 • * గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు.(లాల్ బహుద్దూర్ శాస్త్రి)
 • * కపట యోగులు విపరీతంగా పెరిగి పోతారు. వీరివలన ప్రజలంతా మోసపోతారు.
 • * అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి.

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved