ప్రపంచ రికార్డు కొట్టిన ఆటో డ్రైవర్ కొడుకు.. 323 బంతుల్లో 59 సిక్సర్లు, 129 ఫోర్లతో 1009*

సమకాలిన ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ అత్యద్భుత రికార్డు నమోదు అయింది. స్కూల్ స్థాయి పోటీల్లో ప్రపంచాన్ని అబ్బురపరుస్తూ సోమవారం ఒకే రోజు 652 పరుగులు సాధించి రికార్డు కొట్టిన ముంబై స్కూల్ కుర్రాడు ప్రణవ్ ధనవాడే.. ఈ రోజుకు 1009* చేసాడు. ఓ ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డుల పుటలకెక్కాడు. ఆటో డ్రైవర్ కొడుకైన ప్రణవ్, ఇప్పుడు ఇండియా లో సంచలన క్రికెటర్ గా అవతరించాడు. మంగళవారం లంచ్ సమయానికి..

921 పరుగులతో క్రీజులో ఉండగా.. ఆ తరువాత ఈ రికార్డు సాధించాడు. ప్రణవ్ 323 బంతుల్లో 59 సిక్సర్లు, 129 ఫోర్లతో 1009* పరుగులు చేసాడు. ఇప్పటి వరకు ఏ స్థాయిలోనైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. కేసీ గాంధీ స్కూల్ తరపున ప్రణవ్ బరిలోకి దిగగా.. ప్రత్యర్థిగా ఉన్న ఆర్యా స్కూల్ బౌలర్లు అతనిపై ఎంతమాత్రమూ ప్రభావం చూపలేకపోయారు. ఈ ఒక్క ఇన్నింగ్స్ తో ప్రణవ్ పై క్రీడా ప్రపంచం అభినందనల వర్షం కురిపిస్తోంది. అనంతరం గాంధీ స్కూల్ జట్టు 1465 పరుగులు చేసింది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved