మనలో చాలా మంది త్రాగే నీటిని క్యాన్ల రూపంలోనో , బాటిల్స్ రూపం లోనో కొంటున్నారు.

కాని వాటిలో స్వచ్చత నిజంగా ఉందా అనే సందేహం చాలామందిలో ఉంది. కాని ఈమధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం ఏమంటే, చాలా ప్రాంతాలలో నీళ్ళలో ఒక రకమైన కెమికల్ ను కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ముతున్నారు. దీని వల్ల మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగిపోయి ఎముకలు డొల్లగా అవుతున్నాయి. దీనివలన ఎముకలు పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగిపోతున్నాయి.

మన భారతదేశంలోని పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం త్రాగే నీటి విషయంగా కొన్ని కచ్చితమైన పద్దతులు పాటించేవారు.. అందులో ముఖ్యమైనదేమిటంటే, నీటిని శుభ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు. వీటిని వాడటం వలన నీటిలో ఉండే సూక్ష్మక్రిములు చనిపోతాయి.

ఈమధ్య జరిగిన ఒక ప్రయోగంలో ''రోబ్ రీడ్'' అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచనకారి అయిన ఒక సూక్ష్మక్రిమిని వేశారు. దీనిని 24గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి, రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది. మరల 48 గంటల తరువాత పరిశీలించగా రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99శతం నశించిపోయాయి. కాని ప్లాస్టిక్, పాత్రలలో వేసిన క్రిమి 24గంటలకి రెట్టింపు అయింది. 48 గంటలకి మరింత రెట్టింపు అయింది అని కనుగొన్నారు. అంటే రాగి , ఇత్తడి పాత్రలు మన ఆరోగ్య రక్షణలో ప్రముఖ పాత్ర వహిస్తాయని నిరూపణ అయింది.

కనుక రాగి, ఇత్తడి పాత్రలను వాడండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved