హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసు ఆపగానే మీ మొబైల్ చూపిస్తే చాలు

మొబైల్‌లో లైసెన్స్‌, ఆర్సీ!

మనం ఏదో పని అర్జెంటు గా వెళ్తాం . కంగారులో మన లైసెన్స్‌, ఆర్సీ మర్చిపోతాం . ట్రాఫిక్‌ పోలీసులను చూడగానే గుర్తు వస్తుంది మన లైసెన్స్‌, ఆర్సీ ఇంట్లో మర్చి పోయి వచ్చాము అన్ని. ఇంకా చేసేది ఫైన్ పే చేయడం. ఒక్కో సారి ట్రాఫిక్‌ పోలీసు ఆపగానే లైసెన్సు, ఆర్సీని ఠక్కున తీసి చూపిస్తాం! అయితే ఇక నుంచి మొబైల్‌ తీస్తే చాలు! సినిమా టికెట్‌, రైలు టికెట్‌, బస్సు టికెట్‌లాగానే సెల్‌ఫోన్లోనే లైసెన్సు, ఆర్సీ లు వచ్చేస్తాయి! అందుకోసం రవాణా శాఖ ఎం-వ్యాలెట్‌ అనే యాప్‌ను ప్రవేశపెట్టింది. అందులోకి వెళ్లి లైసెన్స్‌, ఆర్సీని డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరి! దేశంలో ఎం-వ్యాలెట్‌ను అమలు చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ.

ఎం-వ్యాలెట్‌ ప్రత్యేకతలివీ…

మొబైల్‌లో డ్రైవింగ్‌ లైసెన్సు నెంబరు, పుట్టిన తేదీ, ఏ ఆర్టీఏ కార్యాలయం నుంచి సర్టిఫికెట్లు తీసుకున్నది ఎంట్రీచేస్తే చాలు.. క్షణాల్లో యాప్‌ మొత్తం వివరాలను వెల్లడిస్తుంది. ఇందుకు అనుగుణంగా రవాణాశాఖ పాస్‌వర్డ్‌ కేటాయిస్తుంది. వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్టు కూడా ఇదే తరహాలో రికార్డు చేసుకోవచ్చు. ఒకసారి మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే, ఒరిజినల్‌ సర్టిఫికెట్లు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలపై డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

డౌన్లోడ్ చేసుకోవాలి అనుకొనే వాళ్ళు ఇక్కడ క్లిక్ చెయ్యండి

Download RTA m-Wallet


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved