అక్కడ అప్పు కావాలంటే నగ్నచిత్రాలు తాకట్టు పెట్టాలంట.!

దేశాలు ఏవైనా ధౌర్భగ్యుల ఆలోచనలు మాత్రం మారలేదు. మన దగ్గర కాల్ మనీ మాదిరిగా చైనా లో అప్పు ఇవ్వడానికి ఓ కొత్త కండీషన్ రన్నింగ్ లో ఉందట.! అప్పు కావాలనుకునే వారు తాము నగ్నంగా దిగిన దృశ్యాలను తాకట్టు పెట్టాలంట! అలా తాకట్టు పెడితే…అడిగినంత డబ్బును ముట్టజెబుతారంట. ఒక వేళ ఇస్తానన్న టైమ్ కు డబ్బు ఇవ్వకపోతే..ఆ చిత్రాలు బయటపెడతామని బెదిరించి శారీరకంగా వాడుకుంటారంట.!

ఇటీవల ఓ మహిళ, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం ఒక్కసారిగా అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఇప్పటికే ఈ ఉబిలో చాలా మంది మహిళలు కూరుకుపోయి ఉన్నారట. అయితే ఈ మహిళ కూడా అలాగే తన నగ్న దృశ్యాలను తాకట్టుగా పెట్టి లక్ష యువాన్ లు అప్పుగా తెచ్చుకుందట…. అది సంవత్సరంలో 2.5 యువాన్ అయ్యింది. అంటే అసలుకు ఒకటిన్నర రెట్లు అధికమన్న మాట. డబ్బు చెల్లించమని లేకపోతే తన న్యూడ్ దృశ్యాలు బహిర్గత పరుస్తానని సదరు తాకట్టు దుకాణాదారుడు బెదిరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ బయటపడింది.

డబ్బులు కట్టినప్పటికీ అమ్మాయిల నగ్నచిత్రాలను చాలా మంది నెట్ లో అప్ లోడ్ చేయడం, బెదిరించి మరీ వారిని శారీరకంగా వాడుకోవడవం లాంటివి చేస్తున్నారట..అక్కడి తాకట్టుదుకాణాదారులు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved