సపోటా శక్తి

సపోటా అద్భుతమైన రుచిని అందించే పండ్లలో ఇదీ ఒకటి. దీనిలో ఉండే గుజ్జుకు త్వరగా జీర్ణం చేసే గుణం ఉంటుంది. సపోటాలో శక్తిని ఇచ్చే గ్లూకోజ్ లభిస్తుంది. క్రీడాకారులకు సపోటా తినమని నిపుణులు సలహా ఇస్తుంటారు. సపోటా కంటికి చాలా మంచిది. దీనిలో విటమిన్ ఎ అధికంగా ఉండి, వృద్ధాప్యంలో కూడా కంటి చూపు బాగుండడానికి సహాయపడుతుంది. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల సపోటా పండు ఎముకల గట్టితనానికి, పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. పిండిపదార్థాలు, అవసరమైన ఇతర పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండటం వల్ల గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు చాలా ఉపయోగకరం. సపోటా పండు శక్తివంతమైన ఉపశమనకారి కావడం వల్ల నరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమితో,అందోళనతో బాధపడుతున్న వ్యక్తులకు సపోటా చాలా మంచిది. ఇది జలుబు, దగ్గు తగ్గడానికి దోహదం చేస్తుంది. మూత్ర పిండాల్లో రాళ్లు తొలగిపోవడానికి సపోటా సహాయపడుతుంది. స్థూలకాయ సమస్యకు కూడా విరుగుడు సపోటా. ఈ పండులో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని తేమగా ఉంచి అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టును మృదువుగా చేస్తుంది. సపోటా విత్తనాల నుంచి తీసిన నూనెను జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలడాన్ని నివారించి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. చుండ్రును నియంత్రిస్తుంది. మొహం మీద ముడతలను తగ్గిస్తుంది. సపోటాలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved