నిర్భయ ఉదంతంతో మన దేశానికి ఉన్న పరువు అంతా ప్రపంచ దేశాల ముందు పోయింది. భారతదేశం లో స్త్రీ కి భద్రత లేదు అని తేటతెల్లం అయ్యింది. కనీసం అటువంటివి పునరావృత్తం కాకుండా చట్టాలను బలోపేతం చేసార అంటే అదీ లేదు. సంఘటన జరిగిన ఒక 10 రోజులు మాత్రం ప్రజలు మీడియా గోల చేస్తారు, తరువాత అందరూ మర్చిపోతారు. మీడియా కి పాత విషయాలు అవసరం లేదు, ప్రజలకు పాత విషయాలు గుర్తు పెట్టుకొనే టైము లేదు. ఎవరు భయ్యా ఇండియా లో ఆడపిల్లకి భద్రత ఉంది అని చెప్పింది? చట్టాలు మారవు మనుషులు మారరు. ప్రభుత్వాలు కూడా కించిత్ బాధని వెలిబుచ్చట్లేదు, బాహుబలి గురించి ప్రముఖులు ట్విట్టెర్ లో రివ్యూలు రాస్తారు కాని ఒక అడపిల్లకి అన్యాయం జరిగితే మాత్రం దాన్ని ఖండించే టైం కూడా ఉండడు. అడపడుచులని కొల్పోతున్న భరతమాత మౌనంగా సొకిస్తుంది అని తెలిసి కూడా మౌనంగా ఉంతున్న పెద్ద మనుషులని ఏమనాలి? మేధావులు, సొషలిస్టులు, సంఘసంస్కర్తలు అని గొప్పలు చెప్పుకొవటానికే తప్ప వారి వల్ల పైసా ఉపయోగం లేదు ఈ దేశానికి. నాకు నచ్చిన ఒక సినిమా డైలాగు "ఒక అమాయకురాలైన ఆడపిల్లకు న్యాయం చేయలేని సీ.ఎం. ఉంటే ఎంత ఊడితే ఎంత? చేతగాని వ్యవస్తలో చేతగాని సీ.ఎం. ఇది కాదండీ ప్రజలు కోరుకొనేది, వ్యవస్థ లో మార్పు విధానాలలో మార్పు, రాజకీయాలలో మార్పు"........‪#‎snehahastam‬

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved