అలర్ట్: హోమియోపతిలోనూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలుసా ?

హోమియోపతి ! ఇప్పుడు చాలా మంది ఎట్రాక్ట్ అవుతున్న ట్రీట్మెంట్ ఇది. తక్కువ ఖర్చులో లభించడం, కాస్త ఎక్కువ హానికారకం కాకపోవడంతో.. దీనిని ఎక్కువగా నమ్ముతున్నారు. కానీ ఇందులో కూడా సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయని ఎప్పుడైనా విన్నారా ? నిజమే.. హోమియోపతిలోనూ సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయి.

అల్లోపతి మెడిసిన్స్ నే హోమియోపతిగా పిలుస్తారు. వీటిని చాలా సేఫ్ ట్రీట్మెంట్ గా చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ హోమియోపతి గురించి చాలా ప్రశ్నలున్నాయి. అలాగే ఇది రివర్స్ లో సైడ్ ఎఫెక్ట్ చూపిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

చాలామందికి అవగాహన లేక ఇంగ్లీష్ మందులకంటే.. హోమియోపతి ఎక్కువ పవర్ ఫుల్ గా పనిచేస్తాయని భావిస్తున్నారు. కానీ వీటి గురించి పూర్తీగా తెలుసుకుని ఉపయోగించడం మంచిది. ఇంతకీ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా కలిగే దుష్ర్పభావాలేంటో ఇప్పుడు చూద్దాం.

వెంటనే ట్రీట్మెంట్

హోమియోపతి మెడిసిన్స్ కొన్ని రకాల వ్యాధులకు మాత్రమే సరిపోతాయి. కొన్ని రకాల వ్యాధులకు వెంటనే ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు హోమియోపతి మెడిసిన్స్ ని ఉపయోగించడం వల్ల.. ఫలితం ఉండదు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో తీవ్రప్రమాదం ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రాణానికే ముప్పు తీసుకురావచ్చు.

పేషంట్స్ హిస్టరీ

హోమియోపతి రూల్స్ ప్రకారం మందులు ఇవ్వాలంటే.. పేషంట్స్ కంప్లీట్ హిస్టరీ అవసరవుతుంది. దీనివల్ల మందులు ఇవ్వడం కూడా ఆలస్యమవుతుంది. దీంతో.. పేషంట్స్ కండిషన్ మరింత సీరియస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కొత్త సమస్యలు ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయి.

ఓవర్ డోస్

హోమియోపతి మెడిసిన్స్ ఎన్ని రోజులు చెబితే అన్ని రోజులు మాత్రమే ఉపయోగించాలి. అంతకుమించి వాడితే.. సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. కాబట్టి చాలా కేర్ ఫుల్ గా ఉండాలి.

పొట్టలో ఇన్ఫెక్షన్స్.

హోమియోపతి చాలా సేఫ్ అని చెబుతున్నప్పటికీ.. ఇవి ఓవర్ డోస్ అయ్యాయి అంటే.. చాలా హానికరం. పొట్టలో ఇన్ఫెక్షన్స్, ముక్కులో నుంచి రక్తం కారడం, డయేరియా వంటి సమస్యలు వేధిస్తాయి

అధికమయ్యే ఛాన్స్

సరైన హోమియోపతి మందులనే వాడుతున్నా కూడా.. కొన్ని సందర్భాల్లో పేషంట్స్ పై రివర్స్ లో పనిచేస్తాయి. వీటి ప్రభావం చాలా నెమ్మదిగా ఉండటం వల్ల రోగులకు వ్యాధి నుంచి ఉపశమనం కలగడం చాలా నిదానంగా ఉంటుంది. దీనివల్ల లక్షణాల్లో ఎలాంటి మార్పులు కనిపించవు.

కొంతమందికి మాత్రమే

హోమియోపతి మందులు కొంతమందికి మాత్రమే సెట్ అవుతాయి. అనేకమందికి ఇవి దుష్ర్పభావాన్ని చూపిస్తాయి. హానికర సైడ్ ఎఫెక్ట్స్ కాకపోయినా.. హెల్త్ కండిషన్ లో ఎలాంటి మార్పు ఉండదు. ఇవి చాలా నెమ్మదిగా పనిచేస్తాయన్న భ్రమలో కొంతమంది నిర్లక్ష్యం చేసే అవకాశముంది. దీనివల్ల పేషంట్స్ మరిన్ని కొత్త సమస్యలు ఎదుర్కునే అవకాశముంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved