కంప్యూటర్ పై వర్క్ చేస్తున్నారా ? అయితే ఒక్కసారి ఇటు చూడండి!

ఈ ఆధునిక కాలంలో వర్కింగ్ పీపులే కాదు… చదువుకునే పిల్లల లైఫ్ కూడా కంప్యూటర్ తో ముడిపడిపోయింది. ఉద్యోగరీత్యానో, వ్యాపార రీత్యానో లేక ఎడ్యుకేషన్ పరంగానో కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. అయితే అలా కంప్యూటర్ల ముందు గంటల తరబడి వర్క్ చేస్తున్నప్పుడు కళ్లజోడు తప్పనిసరిగా వాడాలని అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవి మామూలు యాంటీ గ్లేర్ గ్లాసెసైనా లేక పవర్ గ్లాసెసైనా కావచ్చని అంటున్నారు.

అదేపనిగా కంప్యూటర్ ను చూడకూడదని, అలాగే తదేకంగా 20 నిమిషాల పాటు ఒకే వైపు చూడకూడదని అంటున్నారు. అదే పనిగా కంప్యూటర్ ను చూడడం వల్ల కంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. రెటీనాలోని రక్తనాళాల్లో ఏర్పడే రుగ్మతలతో కంటి సమస్యలు ఏర్పడతాయని, అందుచేత కంప్యూటర్ పై ఎక్కువ గంటలు కూర్చునే వారు అప్పడప్పుడు దృష్టి మళ్లిస్తూ కంటికి వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. 20 నిమిషాలకొకసారి చూపును మార్చాలని, రెండు నిమిషాల పాటు దూరంగా ఉన్న వస్తువులను చూడాలని చెబుతున్నారు. కంప్యూటర్ ముందు పనిచేసే వారికి స్పెషల్ కళ్లజోడులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని, అవి తప్పక వాడాలని అంటున్నారు. ఇలా చేయటం వల్ల కంటి సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved