గోదావరి నీటిలో ఈకోలీ బ్యాక్టీరియా సాధారణ స్థాయి కంటే పది రెట్లు అధికంగా ఉందని కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చింది. పుష్కర స్నానం మూడు నిమిషాల్లో ముగించి బయటకు రావాలనీ , కళ్ళు , ముక్కు , నోటిలోకి నీళ్ళు పోకుండా చూసుకోవాలని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ శాస్త్రవేత్త సత్యాజీరావు గారు సూచించారు. నీటిలో ఈకోలీ స్థాయి అధికంగా ఉంటే వాంతులు , విరేచనాలు వచ్చే ప్రమాదం ఉంది. ఈకోలీ మందులకు ఒక పట్టాన లొంగదు. వ్యాధినిరోధకత తక్కువ ఉన్నవాళ్ళు ఇలాంటి నీళ్ళలో స్నానం చేస్తే ముందుగా ద్రవాలు , పళ్ళరసాలు అధికంగా తీసుకోవాలి. పుష్కర స్నానం చేసాక వీలైనంత త్వరగా మంచి నీటితో స్నానం చేయాలి. నదిలో స్నానం చేసిన బట్టలను వెంటనే విడిచి పొడి బట్టలు ధరించాలి. తడి బట్టలతో ఎక్కువసేపు ఉంటే చర్మ వ్యాధులకు గురయ్యే అవకాశాలు అధికం. నీటి ప్రవాహం లేని చోట అసలు స్నానం చేయవద్దు. పొరపాటున నీటిని నోట్లోకి తీసుకొని తాగితే వెంటనే ఏమీ తెలియదు. రెండు రోజుల తర్వాత నీరసం, వాంతులు , విరోచనాలతో కూడిన లక్షణాలు కనిపిస్తాయి.

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved