ప్రశాంతమైన నిద్ర ఆయువును పెంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందిస్తుంది . అలాంటి నిద్రకు విపరీతమైన భంగం కలిగించే గురక గురించి తెలుసుకోండి...గురకని గుర్తించటానికి కొన్ని మార్గాలు

నోరు మూసుకొని గురక పెడితే మీ నాలుకలోనే సమస్య ఉందని గుర్తించాలి. నోరు తెరచి గురకపెడితే మీ గొంతులోని మృదువైన కణజాల సమస్యగా గుర్తించాలి. వెల్లకిలా పడుకొని గురకపెడితే ప్రధాన సమస్యగా గుర్తించాలి.

ఏ రకంగా నిద్ర పోయినా గురక వస్తుంటే దాన్ని తీవ్రమైన సమస్యగా గుర్తించాలి.

గురక తగ్గటానికి కొన్ని ఇంటి చిట్కాలు

1. ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంటు ఆయిల్‌ చుక్కలు వేసి

2.రాత్రి నిద్ర పోయే ముందు నోటిలో పోసుకొని బాగా పుక్కిలించాలి.

3.కొద్దిగా పిప్పర్‌మెంటు ఆయిల్‌ను చేతి వేళ్లకు రాసుకొని వాసన చూస్తుంటే గురక తగ్గుతుంది.

4.అర టీ స్పూన్‌ తేనె,అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగిన మంచి పలితం కనపడుతుంది.

5.రాత్రి పడుకొనే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టాలి.

6. ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్ర పోయే ముందు తాగి పడుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.

Guraka thaggalante emi cheyali


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved