డెబ్బై ఏళ్ళ తన తండ్రి చేయి పట్టుకొని , మెల్లగా నడిపించుకుంటూ తీసుకెళ్ళి , హోటల్ లో ఓ టేబుల్ దగ్గర తన పక్కనే కూర్చోబెట్టుకొని , ఇద్దరికీ ఇడ్లీ , సాంబార్ తెమ్మని ఆర్డర్ ఇచ్చాడు రఘు.

ఆ ఇడ్లీలు తినేటప్పుడు రఘు తండ్రి నోటిలో నుండి సాంబార్ కొంత జారి అతని చొక్కా మీద పడింది.

వయసు మీద పడటం వల్ల చేతులు మెల్లగా వణకడం , నోట్లో పళ్ళు సరిగా లేకపోవడంతో రెండు మూడు చోట్ల అలా చోక్కాపై మరకలు పడ్డాయి.

రఘు వాళ్ళ టేబుల్ చుట్టు ప్రక్కల తింటూ కూర్చొన్న కొందరు యువకులు రఘు తండ్రిని , అతని చొక్కాపై పడిన ఆ మరకలను చూసి అసహ్యించుకుంటూ, ముఖాలను ప్రక్కకు తిప్పుకొని ఏదో ఎగతాళిగా మాట్లాడుకున్నారు.

రఘు వాళ్ళందరి ప్రవర్తనను చూసినా కూడా , వాళ్ళను ఏమీ పట్టించుకోకుండా తిన్న తర్వాత తన తండ్రిని వాష్ బేసిన్ వద్దకు తీసుకెళ్ళాడు.

తన దగ్గరున్న కర్చీప్ ను నీటితో తడిపి , తన తండ్రి చొక్కా మీద పడ్డ మరకను తుడవడంతో పాటు , అతని పెదవుల ప్రక్కన కొద్దిగా అంటుకొని ఉన్న ఇడ్లీ ముక్కలను కూడా నీట్ గా తుడిచాడు.

తర్వాత కౌంటర్ వద్దకు వెళ్ళి బిల్లును కట్టేసి , తన తండ్రితో పాటు రెండడుగులు ముందుకు వేయగానీ, వెనుక నుంచి ఎవరో పిలిచినట్లుగా అనిపించి వెనుకకు తిరిగి చూసాడు.

అక్కడే ఓ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న ఓ పెద్దాయన " బాబూ........! ఇక్కడ నువ్వు కొన్ని వదిలి వెళుతున్నావు " అని అన్నాడు.

లేదండీ........, నా బ్యాగ్ నాతోనే ఉంది, నేనేమీ ఇక్కడ వదల్లేదండీ.........! అని అన్నాడు రఘు ఆ పెద్దాయనతో......

అప్పుడు ఆ పెద్దాయన రఘుతో , " బాబూ........! నేననేది నీ బ్యాగ్ గురించి కాదు.

ఇక్కడున్న కొడుకులందరికీ కన్నవారిని ఎలా ఓపికగా, ప్రేమగా చూసుకోవాలో అనే ఓ జీవిత పాఠం వదిలి వెళుతున్నావు.......,

అలాగే ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రీ ఇలాంటి కొడుకు మాకు కూడా ఒకడుంటే ......బాగుండునే......అనే ఒక మధురానుభూతిని , ఓ తీయని జ్ఞాపకాన్ని వదిలి వెళుతున్నావు" అంటూ........

నెమ్మదిగా లేచి వచ్చి రఘు భుజాన్ని తడుతూ ఇలాంటి ప్రేమాభిమానాలున్న కొడుకు ప్రతి కుటుంబానికీ ఉండాలి అని అన్నాడు.

ఆ పెద్దాయన మాటలు విన్న హోటల్ లోని వారంతా నిశ్శబ్దంగా రఘు వైపే అలాగే చూస్తూ ఉండిపోయారు...

Love u r parents..

ఇ విషయాలు మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చెయ్యండి


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved