ఆపరేషన్‌ తర్వాత కుట్లకు స్వస్తి?

ఆపరేషన్‌ చేసేటప్పుడు మత్తులో ఉండి బాధ తెలీదుగానీ.. ఆ తర్వాత కుట్లతో పడే బాధే ఎక్కువ! పెద్దాపరేషన్‌ అయితే కనీసం కుట్లు ఎండటానికి రెండు, మూడు నెలలు పడుతుంది. అలాంటి బాధలేమీ లేకుండా.. ఎంచక్కా ఆపరేషన్‌ అయిన పావుగంటలోనే శస్త్రచికిత్స కోసం చేసిన కోత తాలూకూ గాయాన్ని చాలావరకూ మాన్పే లేజర్‌ పరికరాన్నొకదాన్ని శాస్త్రజ్ఞులు తయారుచేశారు. ఈ చికిత్సలో భాగంగా.. శస్త్రచికిత్స కోసం కోత పెట్టిన భాగంలో బయోడీగ్రేడబుల్‌ ఆప్టికల్‌ ఫైబర్స్‌తో తయారుచేసిన రోజ్‌ బెంగాల్‌ అనే జిగురు పదార్థాన్ని పూస్తారు. తర్వాత దానిపై వేవ్‌గైడ్‌ అనే పరికరాన్ని పెట్టి, ఆకుపచ్చరంగు లేజర్‌ కిరణాలను ప్రసరింపజేస్తారు. ఆ కిరణాలు చర్మంలోకి చొచ్చుకుని వెళ్లి తెగిన భాగాలను అతుకుతాయి. పందులపై చేసిన ప్రయోగాల్లో ఈ లేజర్‌ చికిత్స మంచి ఫలితాలను ఇచ్చింది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved