సిగరెట్ మానుటకు సూచనలు

కొంత మంది పొగ తాగటం హానికరం అని తెలిసిన మత్తు మందుగా పేర్కొనబడే నికోటిన్ ప్రభావం వలన సిగరెట్'ను తాగకుండా ఉండలేరు. అలాంటి వారి కోసం సరైన సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.

ఊపిరితిత్తులతో ఆటలు మానండి

మీ జీవితంలో నిర్వహించే కష్టతరమైన పనులను గుర్తు తెచ్చుకోండి, మీరు కలిగి ఉన్న అవలక్షణాల వలన అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఉదాహరణకు ఇంటర్వ్యూలో భయం మరియు సమాధానాలు చెప్పటం వంటి పైన ఈ అవలక్షణాల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా సిగరెట్ వలన ఆరోగ్యం పాడవటమే కాకుండా, మానసిక స్థైర్యం మరియు బలం, బలహీనతల పైన అన్ని రకాలుగా సమస్యలకు గురి చేస్తాయి. సిగరెట్ వలన మొదటగా ప్రమాదానికి గురయ్యే అవయవం ఊపిరితిత్తులు

సిగరెట్'కు బదులుగా గమ్స్'లను వాడండి

మీ సిగరెట్ అలవాటును మానుకోటానికి సిగరెట్'కు బదులుగా ఆరోగ్యాన్ని పెంపొందించే అలవాట్లను వృద్ధి చేసుకోండి. ఎల్లప్పుడూ మీతో చూయింగ్ గమ్స్, చాక్లెట్'లను తీసుకెళ్ళండి. సిగరెట్ మానేసిన కొన్ని రోజుల వరకు సిగరెట్ పైన ఉన్న కోరిక లేదా వ్యామోహాన్ని నియంత్రణలో ఉంచుకోటానికి ఇవి సహాయపడతాయి. ఈ సమయంలో మీరు వేసే అడుగు పైన మాత్రమె సిగరెట్ మానేయటం ఆధారపడి ఉంటుంది

సిగరెట్'లను తుంచి వేయండి

సిగరెట్ మరియు వాటికి సంబంధించిన అన్ని రకాల వస్తువులను తుంచి భయటపడేయండి. అగ్గిపెట్టె, ఆష్ట్రే, లైటర్, రోలింగ్ పేపర్, హుక్క బాటిల్స్ వంటి సిగరెట్'కు సంబంధించిన అన్ని రకాల వస్తువులను భయట విసిరేయండి. ఫలితంగా మీ దృష్టి సిగరెట్ వైపు వెళ్ళకుండా ఉంటుంది. మానసికంగా స్థిరత్వాన్ని కలిగి ఉండటం చాలా అవసరం.

లక్ష్య నిర్దేషణ

స్వతహాగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. సిగరెట్ మానటంలో లక్ష్య నిర్దారణ చాలా ముఖ్యం కారణం సిగరెట్ అలవాటును వారం రోజుల్లో మానటం చాలా కష్టం. ముఖ్యంగా సిగరెట్'కు భానిస అయిన వారిలో మాన్పించటం చాలా కష్టం. సిగరెట్ మానాలి అనే ప్రక్రియను ఒక ప్రణాలిక పరంగా అనుసరించండి. లక్ష్యం కోసం నిర్దేశించిన ప్రణాలిక పైన ఏ విధమైన ఆటంకాలు లేకుండా నిర్వహించటం పైన దృష్టి సారించండి

సిగరెట్ తాగను అని అంతర్గతంగా చెప్పండి

మీరు పొగతాగటం మానేసిన తరువాత, ప్రతి రోజు మీలో మీరుగా నేను సిగరెట్తా గను అని సమాధానంగా చెప్పుకోండి. మానసికంగా పాజిటివ్'గా మరియు పొగ నిర్దేశిత ప్రాంతాలలో తిరగటానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వలన మానసిక ద్రుడత్వాన్ని పొందినవారు అవుతారు.

కొనసాగించండి

కొంత మంది పొగతాగిన తరువాత సిగరెట్ పైన ఉన్న వ్యామోహం లేదా నికోటిన్ పైన ఉన్న కోరికతో తిరిగి సిగరెట్ తాగటాన్ని ప్రారంభిస్తారు. సిగరెట్ తాగటం మానేసిన తరువాత 3 నెలల వరకు మానేసిన సిగరెట్ వైపు తిరిగి మొగ్గు చూపే అవకాశం ఉంది అని పరిశోధనలలో వెల్లడయింది. కావున, మొదటి మూడు నెలల పాటూ సిగరెట్ పై ఉన్న వ్యామోహాన్ని నియంత్రించ గలిగితే, దాదాపు లక్ష్యాన్ని చేదించినట్లే.

మీ స్నేహితులకు తెలపండి

కొంత మంది ఆల్కహాల్ తాగే సమయంలో తప్పక సిగరెట్ తాగుతారు, అందులో మీరు ఒకరిగా ఉన్నట్లయితే, ప్రణాళికల గురించి వారికి తెలపండి. సిగరెట్ మానేసినందు వలన విరామ సమయంలో మీతో సమయం కేటాయించలేను అని సహా ఉద్యోగులకు నచ్చచెప్పండి. వారిని భాద పెట్టకుండా ఈ విషయాన్ని తెలపండి

quit smoking tips in telugu


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved