వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఏడు సూత్రాలు !!

ఎండలు ఎక్కువయ్యాయి. పిల్లల, పెద్దలు చాలా జాగ్రత్తగా మెలగాలిసిన సమయం. ఎండ వడ ధాటికి చిన్న పిల్లలు సైతం రాలిపోతున్న తరుణం. ఇలా జరుగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. భానుడి తాపం నుంచి పూర్తిగా తప్పించుకోకపోయినా ఆరోగ్యానికి ఎంతోకొంత ఉపశమనం కలిగించడానికే ఈ సప్త సూత్రాలు..

నీరు: శరీరంలో ఉన్న నీరసాన్ని నీరు చాలావరకు దూరం చేస్తుంది. వేసవిలో నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. ఇలా చేయడం వల్ల నీరసం తగ్గడమే కాకుండా శరీరంలోని నరాలు, ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే రోజంతా చురుకుదనంగా కనిపిస్తారు.

'ఫ్రెష్‌'గా ఉండాలి: వేసవిలో సాధ్యమైనంత వరకు తాజా ఆహారాన్ని తీసుకోవాలి. నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా తేడాలు రావొచ్చు. భోజనం దగ్గర నుంచి తినుబండారాల వరకూ తాజా వాటికే ప్రాధాన్యమివ్వాలి. ఆ ఆహార ఉత్పత్తులు విడుదల చేసే కాలరీల సారాన్ని మన శరీరం తీసుకుంటుంది.

వ్యాయామం: జీవనశైలిలో ఉన్న ఒత్తిడి మనుషులను వ్యాయామానికి దూరం చేస్తోంది. తీరిక ఉన్నప్పుడు మాత్రమే దాని గురించి పట్టించుకునే పరిస్థితి. వేసవిలో ఎండల తీవ్రతకు నీరసించిపోకుండా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. వ్యాయామం అంటే బరువులే ఎత్తనక్కర్లేదు. సూర్యోదయానికి ముందు మేడ మెట్లు ఎక్కడం... దిగడం చేసినా వ్యాయామం కిందికే వస్తుంది. అలాగే పార్కులు, జూ వంటి ప్రదేశాల్లో ఎక్కువ దూరం నడవాలి. దీనివల్ల ముఖాల్లో తేజస్సు కనిపించడమే కాకుండా వడదెబ్బను తట్టుకోగలుగుతారు.

'కొత్త'గా ఉంటే మంచిది: వేసవి అంటే ఎండలని భయపడుతుంటాం. మనిషి జీవనశైలిని మార్చుకోవడానికి ఇదొక మంచి కాలమట. ఒత్తిడి నుంచి ఎంతోకొంత ఉపశమనం కలగడానికి వ్యాయామాలు, యోగా చేస్తున్న వాళ్లు కొత్త తరహా ఎక్సర్‌సైజ్‌లను మొదలుపెట్టడానికి వేసవి కాలం ఎంతో అనువుగా ఉంటుంది. ధూమపానం అలవాటు ఉన్న వాళ్లు దానికి గుడ్‌బై చెప్పేసి కొత్త ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడానికి ఈ కాలమే మంచిది.

నీడలో నిదానంగా: వేసవిలో ఎంత ఎక్కువ సమయం నీడలో గడిపితే అంత మంచిది. ముఖ్యంగా ఉదయం పది గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో నీడలో తిరగడమే మేలు. వ్యాపారులు, ఇతర ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు సన్‌స్క్రీన్‌, టోపీ, సన్‌గ్లాస్‌ ధరించడం వల్ల ఎండ తీవ్రత నుంచి తమను తాము రక్షించుకోగలరు.

తగినంత నిద్ర: వర్షాకాలం, శీతాకాలం మాటెలా ఉన్నా వేసవికాలంలో మాత్రం తగినంత నిద్ర ఉండి తీరాలి. సమయానికి నిద్రపోవడం వల్ల మనుషులకు మానసిక ప్రశాంతత దరిచేరుతుంది. అలాగే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.


Share on

వారం రోజుల పాటు ఎక్కువ కానున్న సూర్యప్రతాపం… తీసుకోవాల్పిన జాగ్రత్తలు?

ఈరోజు నుండి రాబోయే వారం రోజుల పాటు సూర్యుడి ప్రతాపం ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడు భూమధ్య రేఖకు(equator) దగ్గరగా వస్తున్నాడని, … కాబట్టి వాతావరణంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయని అంటున్నారు. ఉష్ణోగ్రత 40డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు అయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. దీంతో బాడీ త్వరగా డీ హైడ్రేట్ అయిపోతుందని, చిన్నారులు, వృద్ధులు, అనారోగ్య బాధితులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

*ప్రతి రూంలో మూతలు లేని రెండు బక్కెట్లతో నీళ్లు ఉంచాలంటున్నారు. తద్వారా రూంలోని తేమ తగ్గకుండా ఉంటుందని అంటున్నారు.

**రోజూ తాగే నీటితో పాటు అదనంగా 2-3 లీటర్ల నీటిని త్రాగాలని సూచిస్తున్నారు.

***మాంసాహారం మాని ప్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తినాలని అంటున్నారు.

****హార్ట్ పేషెంట్లు, బీపీ ఉన్నవారు ఏ మాత్రం అనారోగ్యం ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు.

*****ముఖ్యంగా మధ్యాహ్నం 12-3.00 గంటల లోపు ఎండలో బయటకు రావద్దని, వస్తే చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

******తరుచూ పెదవులను, ఐ బాల్స్ ను చల్లటి గుడ్డతో తుడుచుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు.

*******కాబట్టి సూర్యుడు… భూ మధ్య రేఖకు దగ్గరగా ఉండే ఈ వారం రోజులు జాగ్రత్తగా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved