భారతదేశంలో తొలి హెచ్ఐవీ కేసును గుర్తించిన వైద్యురాలు మృతి

దేశంలో ఓ బాలిక(13)కు ఎయిడ్స్‌ సోకిందని మొదటిసారి గుర్తించి, ఎయిడ్స్‌ చికిత్స పద్ధతులపై పలు పరిశోధనలు చేసిన వైద్యురాలు సునితి సాల్మన్‌(75) చెన్నై అన్నానగర్‌లోని తన నివాసంలో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్‌ సాల్మన్‌ను వివాహం చేసుకున్న సునితి చాలాకాలం మద్రాసు వైద్యకళాశాల, జీహెచ్‌లలో మైక్రోబయాలజీ ఆచార్యులుగా సేవలందించారు. వ్యభిచార కూపంలో చిక్కుకున్న 13 ఏళ్ల చిన్నారికి ఎయిడ్స్‌ లక్షణాలున్నాయని 1986లో గుర్తించి, రికార్డు చేసిన తొలి వైద్యురాలు ఆమె. ఇక అప్పటి నుంచి ఎయిడ్స్‌ నివారణకు విశేష కృషి చేశారు. పలు అవార్డులతో పాటు తమిళనాడు ఎయిడ్స్‌ సొసైటీ జీవితకాల పురస్కారాన్ని 2005లో అందుకున్నారు. కాగా డాక్డర్‌ సునితి సహజమరణం పొందినట్లు ఆమె కుమారుడు సునీల్‌ సుహాస్‌ సాల్మన్‌ తెలిపారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved