సూపర్‌మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

వినియోగదారులతో వారికి కావలసిన వాటికంటే ఎక్కువ కొనిపించడానికి సూపర్‌ మార్కెట్లు కొన్ని చిట్కాలు అనుసరిస్తుంటాయి. కొంచెం శ్రద్ధగా గమనిస్తే మనకు వాటి వెనుక ఉన్న మార్కె‘ట్రిక్స్‌’ అర్థమవుతాయి. వాటిలో కొన్ని...

నిత్యావసరాలైన పప్పు, ఉప్పు, నూనెల వంటివి ఎప్పుడూ చివరలో ఉంచుతారు. ఎందుకంటే కేవలం వాటికోసమే వచ్చిన వారు కూడా మిగతా అరలను దాటుకుంటూ వెళ్తూ మధ్యలో ఏదో ఒకటి తీసుకోకపోరు. 

చాక్లెట్లను ఎప్పుడూ పిల్లల దృష్టి పడేలా, వారికి అందుబాటులో ఉండేలా కింది అరల్లోనే ఉంచుతారు. 

 •  చల్లని వాతావరణంలో మ్యూజిక్‌ ప్లే చేస్తూ ఉంటారు. దానివల్ల వినియోగదారులు హుషారుగా తమకు తెలియకుండానే ఎక్కువ కొనేస్తుంటారు. 

   పెద్ద ట్రాలీలే ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. వాటిలో నాలుగైదు సరుకులు వేసినా ట్రాలీలో అవి తక్కువగా కనిపిస్తూ, ఇంకా ఏమైనా కావలసిన వస్తువులున్నాయేమో అనిపిస్తుంటుంది. 

   గడియారం, కిటికీలు ఎక్కడా కనిపించవు. పైగా వెళ్ళడానికి రావడానికి ఒకే మార్గం ఉంటుంది. దీనివల్ల షాపింగ్‌లో వినియోగదారులకు సమయం తెలియకుండా ఉంటుంది. 

   వస్తువుల విభాగాలను తరచూ మారుస్తూ ఉంటారు. దానివల్ల రెగ్యులర్‌ కస్టమర్లు కూడా తమకు కావల్సిన వస్తువు దగ్గరకు నేరుగా వెళ్ళలేరు. మిగతా విభాగాల్లోని వస్తువుల మీద కూడా వారి దృష్టి పడుతుంది. 

   బిల్‌ కౌంటర్‌ దగ్గర తినుబండారాలు, శీతల పానీయాలు ఉంచుతారు. ఎందుకంటే షాపింగ్‌ అయ్యేప్పటికి నీరసం వచ్చి ఆకలివేసే వారికి వాటిపైకి మనసు మళ్ళుతుంది.

  must share


  Share on

 • © Copyrights telugu-news.in 2016. All rights reserved