రిషితేశ్వరి తల్లిదండ్రులు వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పిన గుండెల్లోని బాధ వారి మాటల్లోనే........

****************************************************

ఒక్కోసారి మాకు రిషి ఫోన్ చేసి "నైట్ 2-3 గంటల పాటు కంటిన్యూస్ గా టార్చర్ చెస్తున్నారు" అని చెప్పేది.

మా అమ్మాయి రిషిని కలిసినపుడు తన సీనియర్స్ తొ "అందరు మంచిగా కలిసి వుండండి" అని చెప్పాం

"అందరం కలిసే వుంటాం అంకుల్.. ప్రోబ్లెం ఏమి లేదు.. జస్ట్ రూం కాళీ చేయ్యి అని చెప్పాం" అన్నారు

ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చెద్దామని ఆయన రూంకి వెళ్ళాం. ఆయన మమ్మల్ని చాంబర్ లొకి కూడ రానివ్వలేదు

"హెచ్.ఒ.డి. తొ వార్డెన్ తొ మట్లాడండి" అని చెప్పి వెళ్ళిపోయాడు

మాకు తెలిసినంత వరకు సీనియర్స్ ర్యాగింగ్ ఇలా వుండేది

"ఏంటి? మీ పేరెంట్స్ వచ్చారు.. కంప్లైంట్ చేయడానికా?

హలో మేడం రిషి.. నీకు తెలుసో లేదొ..

ఇక్కడ ప్రిన్సిపాల్ మాకే సుపోర్ట్.. వార్డెన్, వైస్ ప్రిన్సిపాల్ మాకే ఫుల్ సుపొర్ట్..

మేం తలుచుకుంటే నిన్ను ఏమైనా చేస్తాం.. మర్యాదగా రూం ఖాళీ చేయ్

లేకపోతె అసలు ర్యాగింగ్ అంటే యేంటో చూపిస్తాం.."

ఆ పిచ్చితల్లి మాకు చెప్పకుండా ఇంకా ఎన్నిమాటలు పడిందో.. ఎంత బాద పడిందో

మా అమ్మాయి సుసైడ్ చేసుకుంటుందని తెలిస్తే యెపుడో తీసుకెళ్ళిపోయేవాళ్ళం

మీలో కొందరు ఈ విషయాలు చూసి కుల రాజకీయం చెస్తున్నాం అనుకోవద్దు.. మాకు తెలిసింది చెప్తున్నాం

ఇంకెవరూ ఇలాంటి బాద పడకూడదు.. ఇంకో పేరెంట్స్ ఎవరికీ ఇలాంటి శోకం రాకూడదు

దయచేసి అందరూ అలోచించండి

మాకు సహకరిస్తున్న స్టూడెంట్స్, యెస్.ఎఫ్.ఐ. లీడర్స్, మీడియా, తోటి విద్యార్దులు, తల్లితండ్రులు అందరికి ధన్యవాదాలు

ఇట్లు

రిషితేశ్వరి తల్లితండ్రులు


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved