‘టీ’ ఎక్కువగా తాగుతున్నారా? జర జాగ్రత్త

టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. రెగ్యులర్ గా టీ తాగేవారు సమయానికి తాగకపోతే తలనొప్పి వచ్చేస్తోందని ఫీలవుతారు. కొంతమంది రకరకాల టీలను కలుపుకుని తాగుతూ ఉంటారు. అసలు వీటిని తాగడం మంచిదేనా?

బ్లాక్ టీ..ఇందులో పాలు కలపకుండా తయారు చేస్తారు. ఇది తాగితే ఆరోగ్యకరమని... బరువు తగ్గుతారని చెబుతారు. అయితే బ్లాక్ టీ ఎక్కువగా తీసుకుంటే కడుపులో ఉబ్బరం ఉండటం.. ఆకలి మందగించడం జరుగుతుందట. ఇక పాలతో కలిపిన టీ చాలామందికి ఇష్టంగా తాగుతారు. అయితే ఈ టీని ఎక్కువగా సేవిస్తే టిన్నిటస్ (చెవిలో హోరు) కు వచ్చే అవకాశం ఎక్కువట. ఇక టీ స్ట్రాంగ్ గా ఉంటేనే తాగినట్లు ఉందని.. కొంతమంది టీ పౌడర్ ఎక్కువగా వేసి.. మరి తాగుతారు. ఇది చాలా హానికరం అట. టీలో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వాటి కారణంగా కడుపులో అల్సర్లు ఏర్పడే అవకాశం ఉందట. ఇక కొంతమంది రెండు రకాల టీపౌడర్లను మిక్స్ చేసి మరీ టీ కలుపుకుని తాగుతారు. ఇలా తాగడం వల్ల ఉత్తేజం కలుగుతుందని భావిస్తారు. టీలో టానిన్ అనే పదార్ధం ఉంటుంది. ముఖ్యంగా స్ట్రాంగ్ గా ఉండే టీలో టానిన్ అధిక స్ధాయిలో ఉంటుంది. అది ఆహారంలోని ఇనుముపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత టీ తాగడం అలవాటు ఉంటే మానేయమని వైద్యులు చెబుతున్నారు. ఏదైనా అతి అయితే ప్రమాదమే కాబట్టి.. ఎక్కువగా టీ తాగే అలవాటుని తగ్గించుకోవడం మేలు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved