టీ ఎప్పుడు కనిపెట్టారు

క్రీ.పూ. 2700 సంవత్సరంలో చైనాకు చక్రవర్తిగా సింహాసనమెక్కినవాడు షెన్ నుంగ్ ఈయన కాచి చల్లార్చిన నీరే తాగేవాడు. ఒకరోజు నీరు కాగుతుంటే కొన్ని రకాల చిగుళ్లూ, ఆకులు ఆ నీటి పాత్రలో పడ్డాయి. చక్రవర్తి ఆ విషయం తెలియకుండా నీరు తాగాడు. తాగిన వెంటనే వంటవాడిని పిలిపించాడు. అతడు భయంతో చక్రవర్తి ఎదుట నిలబడ్డాడు. కానీ అప్పటికి చక్రవర్తి ఎంతో ఆనందోత్సాలతో కనబడుతూ ఉన్నట్లు గ్రహించాడు వంటవాడు. చక్రవర్తి వంటవాడిని ఎంతో మెచ్చుకున్నడు కూడా.. అతనికి మంచి బహుమతులు ఇచ్చాడు. ఇంతకీ చక్రవర్తి తాగిన నీటిలో పడినవి తెయకులు. ఈ విషయం తెలియకుండా చక్రవర్తి తాగిన తేనీరు మొదటిది. పాలూ, పంచదార లేని తేనీరు, చక్రవర్తి ఆ రోజు నుంచి ప్రతి దినం అదే తేనీరు తప్పకుండా తాగుతూ వచ్చాడు. ఆస్థానంలో, తర్వాత చైనా దేశమంతట తేనీరు తాగడం ప్రారంభించారు.

తేయాకు ఐరోపా ఖండంలో ప్రవేశించడానికి మాత్రం నాలుగు వేల సంవత్సరాల కాలం పట్టింది. చైనా నుండి బయల్దేరిన ఈస్ట్ ఇండియా కంపెనీలోని డచ్ అధికారులు తమన వెంట తెయాకు తీసుకుని వెళ్లారు. క్రీ.శ.1610 లో చైనా నుండి ఇంగ్లాండ్ కు తేయాకును తీసుకుని వచ్చారు. 1650 నాటికి ఇంగ్లాండ్ లో తేనీరు ప్రసిద్ధపానియమైనది. చైనా నుండి తేయాకు దిగుమతి కావడం వలన దిగుమతి విధానంలో చైనా దేశానికి ఇంగ్లాండ్ భారీ ఎత్తున నిధులు పంపించవలసి వచ్చింది.

విదేశీ మారకం ఇబ్బంది నుండి తప్పించుకోవడానికి బ్రిటీష్ వారు తేనీటి మీద దుష్ప్రచారం ప్రారంభించారు. తేనీరు సేవనం ఆరోగ్యానికి హానికరం అని ప్రచారం చేసేవారు. తేయాకు వాడకం అందుమూలంగా బాగా పడిపోయింది. డా.హెల్స్ అనే వ్యక్తి పంది పిల్లల మీద తేనీటి మీద కొన్ని పరిశోధనలు జరిపారు. పంది పిల్లల తోకలను తేనేటిలో ముంచి వుంచితే వెంట్రుకలు రాలిపోతాయని ఆయన నిరూపించాడు. అయినప్పటికీ తేనేటికి ఆ రోజుల్లో బాగా అలవాటుపడినవాళ్లు ఉండేవారు. ఎన్ని రకాల వ్యతిరేక ప్రచారాలు జరిగినప్పటికీ వారు తేనీటికి దూరం కాలేక పోయారు అక్కడి ప్రజలు. ఈ రోజు కూడా ఇంగ్లిండులో ప్రపంచం మొత్తం మీద తేనేటికి సేవనం ఎక్కువ . అమెరికా అంత ప్రాధాన్యత సంతరించుకోలేకపోయింది. 1773 డిసెంబర్ లో బోస్టన్ రేవులో 342 కార్టన్ల తేనీరు ముంచేసినప్పటికి తేనీటి ప్రాభవం అమెరికాలో అంతగా వ్యాపించలేదు. అమెకన్లకు కప్పు టీ కంటే కాఫీ ఎంతో ప్రియం.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved