దంతాల మద్య పాచి మరియు గారని తొలగించడానికి సులభమైన చిట్కాలు

మిగతా శరీర భాగాలతో పోల్చుకుంటే ఎక్కువగా నిర్లక్ష్యానికి గురయ్యే ప్రదేశం నోరు..! ఉదయం పళ్లు శుభ్రం చేయటం మినహా నోటి ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు చాలా మంది. దంతాల ఏర్పాటు మొదలుకుని, ఆహారపుటలవాట్ల వరకూ ఎన్నో అంశాలు ఓరల్‌ హెల్త్‌ని దెబ్బతీస్తూ ఉంటాయి. వాటిని వెంటనే గుర్తించి తగిన ట్రీట్మెంట్ తీసుకోకపోతే దీర్ఘకాలంలో తీవ్రరుగ్మతలుగా పరిణమించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా చాలా మందిలో పండ్లకు పాచి పట్టడం అనేది మనం చూస్తుంటాం. ఉదయాన్నే నిద్రలేవగానే పళ్లను పరపర తోమి పాచిని వదిలించుకోవాలని చూస్తుంటారు చాలా మంది. అయితే గార పట్టుకుపోయిన, లోపల పళ్లకు అలాగే పెంకుళ్లా అట్టకట్టుకు పోయిన పాచిని తొలగించడం కేవలం బ్రెషింగ్ వల్ల కాదు. అందుకోసం మరింత శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది.

దంతాల మద్య లేదా దంతాల వెనుక దాగి ఉన్న గారను, పాచినీ తొలగించుకోవడానికి ప్రతి నెలా డెంటిస్ట్ ను కలిస్తూన్నారా...? అయినా ఫలితం లేకుండా ఉన్నదా..అయితే ఈ దంత సమస్యలను నివారించడానికి కొన్ని ఉత్తమ హోం రెమెడీస్ ఉన్నాయి. పళ్ళ మీద పాచి బాగా గారకట్టుకుపోవడం, చిగుళ్ళు వాచి ఎర్రబడడం, చిగుళ్ళ వెంబడి రక్తం కారటం మొదలైనవన్నీ చిగుళ్ళ రోగ లక్షణం. దంతాల మీద పాచి తీయించుకుంటుండాలి.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం దంతాల గురించి మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నా...కూడా నోట్లో బ్యాక్టీరియా అలాగే ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ప్రోటీన్స్ తో మిక్స్ అవుతుంది మరియు అలాడే ఆహారపదార్థాలకు కూడా అంటుకోవడం వల్ల దంతాల మద్యకు చేరి పాచిలా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినదాన్నే డెంటల్ ప్లాక్ అని పిలుస్తారు . ఇలా దంతాల మధ్య ఇబ్బందికరంగా ఏర్పడిన పాచీ ఎప్పటికప్పుడు క్లీన్ చసుకోకపోతే క్లీన్ చేయడం కూడా కష్టం అవుతుంది. ముఖ్యంగా దంతాల వెనుక భాగంలో టూత్ బ్రష్ తో శుభ్రం చేసినా ఫలితం ఉండదు.

డెంటిస్ట్ ను సంప్రదించకపోవడం, పాచిని తొలగించడంలో ఫెయిల్ అవ్వడం వల్ల అనేక దంత సమస్యలకు దారితీస్తుంది. నోటిలోపల ఇన్ఫ్లమేషన్ మరియు దంతక్షయానికి దారితీస్తుంది. అలాగే నోట్లో ఉండే బ్యాక్టీరియా ప్రతి సారి మనం తీసుకొనే ఆహారాలతో పాటు బ్యాక్టీరియా కూడా మిక్స్ అయ్యి పొట్టలోకి చేరుతుంది . దాంతో ఇన్ఫెక్షన్స్, మరియు ఇన్ఫ్లమేషన్ ఎదుర్కోవల్సి వస్తుంది. మరియు దంతాలు డ్యామేజ్ అవ్వడం, దంతాల ఎనామిల్ మరియు క్యావిటి సమస్యలకు దారితీస్తుంది.

కాబట్టి, ఈ సమస్యలకు గురికాకుండా ఉండాలంటే మొదట ఎప్పటికప్పుడు దంతాల మద్య ఏర్పడే పాచిని డెంటిస్ట్ అవసరం లేకుండా నేచురల్ పద్దతుల్లో తొలగిస్తుండాలి . అదెలాగో కొన్ని సింపుల్ చిట్కాలను ఈ క్రింది విధంగా...

లవంగాలు: కొన్ని లవంగాలను పౌడర్ చేసి, అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను దంతాలకు అప్లై చేసి, దీన్ని టూత్ బ్రష్ తో బ్రష్ చేయాలి . ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే పండ్ల మద్య ఉన్న పాచిని నేచురల్ గా తొలగించుకోవచ్చు.

స్ట్రాబెర్రీస్ బెస్ట్ నేచురల్ హోం రెమెడీ . ఇది దంతాలను నేచురల్ గా శుభ్రం చేస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా ఫ్రెష్ గా ఉండే స్ట్రాబెర్రీ పండ్లను తీసుకొని వాటితో దంతాలను, చిగుళ్లను రుద్దాలి . కొద్దిసేపు ఇలా మర్దన చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో గార్గిలింగ్ చేసి నోటిని శుభ్రం చేసుకోవాలి.

దానిమ్మ: దానికి ఫ్లవర్స్ ను పొడి చేసి, అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా నీళ్ళు వేసి, పేస్ట్ లా చేసి దంతాలకు అప్లై చేసి బ్రష్ చేసుకోవాలి. ఇలా రెండు రోజులకొకసారి చేస్తుంటే మంచి ఫలితం ుంటుంది. ఇది దంతాల మద్య ఉండే పాచీని నేచురల్ గా తొలగిస్తుంది.

బేకింగ్ సోడా: బేకింగ్ సోడా ఒక ఓల్డెస్ట్ కిచెన్ పదార్థం . పాచిని తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది బేకింగ్ సోడాను బ్రెష్ తో అద్ది దంతాల మీద రుద్దాలి. చాలా కొద్ది సమయంలోనే దంతాల మద్య పాచీ లేకుండా మీరు చూడగలరు.

కొత్తిమీర: క్యావిటీ సమస్యను కొత్తిమీర తగ్గిస్తుందంటే మీరు నమ్ముతారా . దంతాల వెనుక దాగున్న పాచీని నేచురల్ గా తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కొత్తిమీర వాటర్ తో గార్గిలింగ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది.

వాల్ నట్స్ : వాల్ నట్ పేస్ట్ చేసి, అనారోగ్యకరమైన దంతాల మీద , చిగుళ్ళ మీద అప్లై చేసి రెండు నిముషాలు బాగా రుద్దడం వల్ల దంతా మద్య ఉండే పాచిని నేచురల్ గా తొలగించుకోవచ్చు.

యాపిల్ తినాలి: రోజుకు ఒక్క ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదంటారు . అక్షరాల నిజం కొన్ని ఆరోగ్య సమస్యలల్లో దంత సమస్య కూడా ఒకటి. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆపిల్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి . మరియు చిగుళ్లను బలోపేతం చేస్తుంది

ఆరెంజ్ పీల్ : ఆరెంజ్ పీల్ ఎండబెట్టి, పౌడర్ గా చేసి, దానికి కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి దంతాలకు అప్లై చేసి మసాజ్ చేసి బ్రష్ చేయాలి. ఇలా చేయడం వల్ల నేచురల్ గా పాచిని తొలగించుకోవచ్చు. ఈ పద్దతిని వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

హైడ్రోజెన్ పెరాక్సైడ్ ఒక కప్పులో హైడ్రోజెన్ పెరాక్సైడ్ కొంచెం తీసుకుని, దానికి అరకప్పు వేడినీటిని కలిపి ఆ మిశ్రమాన్ని నోటిలో పోసుకుని ఒక నిమిషం పాటు పుక్కిళించాలి. ఆ తర్వాత చల్లని నీటితో పుక్కిళించాలి.

వేపపుల్ల: అప్పుడప్పుడు వేపపుల్లతో దంతాలను దుర్దడం వల్ల నోట్లో, దంతాల మద్య ఉండే బ్యాక్టీరియా తొలగిపోవడంతో పాటు, గార, పాచీ కూడా తొలగించుకోవచ్చు...


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved