తింటున్నారా టొమాటోలు....!

ఆస్తమా ఉన్న వారికి టొమాటో ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీనిలో ఉండే లైకోపీన్, విటమిన్ 'ఎ' ఆస్తమాతో పోరాడటంలో కీలకప్రాత పోషిస్తాయి. ఈ సమస్యతో బాధపడేవారు రోజూ ఒకటి రెండు టొమాటోలు తింటే మంచిదే. వీటిలో క్యాల్షియం అధికం. ఎముకలకు ఇది చాలా మంచిది. ఎక్కువ మొత్తంలో శరీరానికి క్యాల్షియం అందడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు దరిచేరవు. బలహీనంగా, ఎముక సాంద్రత తక్కువగా ఉన్నవారు తరచూ తీసుకునే ఆహారంలో టొమాటో ఉండేలా చూసుకోవాలి.

టొమాటోల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.

ఇవి శరీరంలో వ్యర్థాలను దూరం చేస్తాయి. క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. టొమాటోల్లో లభించే విటమిన్ 'సి' రోగనిరోధక శక్తిని పెంచుతుంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved