టూత్ పేస్ట్ వలన కలిగే అనారోగ్యాలు

థైరాయిడ్ రుగ్మతలు

టూత్ పేస్ట్ వలన థైరాయిడ్ సమస్యలు కలుగుతాయని వినగానే నిజం కాదేమో అని అనుకుంటాము. కానీ, క్రిములను నాశనం చేసే టూత్ పేస్ట్ లలో "ట్రిక్లోసెన్" అనే రసాయనాన్ని కలుపుతారు. మొదట్లో ఈ రసాయనాన్ని పెస్టిసైడ్ లలో వాడేవారు. ఈ రసాయనాన్ని కలిగి ఉన్న టూత్ పేస్ట్ లను వాడటం వలన థైరాయిడ్ సమస్యలు, గుండె సమస్యలు మరియు క్యాన్సర్ కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు.

కిడ్నీ, గుండె & మెదడు సమస్యలు

సంప్రదాయ టూత్ పేస్టులు 'పాలీఇథైలిన్' ను కలిగి ఉంటాయి. దీనిని సాధారణంగా ప్లాస్టిక్ అని కూడా అంటారు. ఈ రసాయనం శరీరానికి విషపదార్థం వలే పనిచేసి, మూత్రపిండాలను, గుండె మరియు మెదడును ప్రమాదానికి గురి చేస్తుంది.

పిల్లలలో మెదడు ప్రమాదానికి గురవుతుంది

టూత్ పేస్ట్ తయారీలో ఫ్లోరైడ్ లను కూడా వాడతారు. ఇవి చిగుళ్ళను మాత్రమే కాకుండా, పిల్లలలో తెలివి తేటలను తగ్గించి వేస్తాయి. గర్భవతులను ఫ్లోరైడ్ ఆధారిత టూత్ పేస్ట్ ల వాడకానికి దూరంగా ఉంచాలి. ఎందుకంటే వీటి వలన థైరాయిడ్ సమస్యలు, ఎముకలు ప్రమాదానికి గురవటం మరియు పొట్టలో సమస్యలను కలుగజేస్తాయి.

నోట్లు అల్సర్ & హార్మోన్ల అసమతుల్యతలు

సోప్ లలో వాడే సోడియం సోడియం లారిల్ సల్ఫేట్ ను టూత్ పేస్ట్ తయారీలో కూడా వాడతారు. వీటి వలన నోట్లో అల్సర్ లు, చర్మ చికాకులు మరియు హార్మోన్ల అసమతుల్యతలు కలుగుతాయి.

మధుమేహం & బరువు పెరుగుదల

తీపి లేదా తీపి పదార్థాలు అంటే ఇష్టమా? టూత్ పేస్ట్ లలో చక్కెరలు కూడా తక్కువగా ఉండవు. టూత్ పేస్ట్ లలో ఉండే అస్పర్టమే అనే కృత్రిమ చక్కెరల వలన మధుమేహం మరియు స్థూలకాయత్వం కలుగుతుందని పరిశోధనలలో వెలువడింది. అంతేకాకుండా, వీటి వలన బ్రెయిన్ ట్యూమర్ వంటి క్యాన్సర్ సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved