సంచలనం.. రెండు తలల శిశువు జన్మించింది

ఈ సృష్టి లో మరో సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఒకటి కన్నా ఎక్కువ తలలు దేవుళ్ళకు చూసాం గాని మనుషులకు ఒక తలనే చూసాం. కాని ఇప్పుడు ఈ వింత సంఘన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రాహ్మణ్ బారియాలోని ఆసుపత్రిలో రెండు తలలతో ఉన్న ఒక వింత శిశువు జన్మించింది. ఈ వింత అక్కడి ప్రజలకు తెలియడంతో ఆ ఆడ శిశువును చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు ఆసుపత్రికి తరలివచ్చారు.

ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ.. " శిశువు ఆరోగ్యం బాగుండకపోవడంతో ఢాకాకు తరలించాము కనుక సరిపోయింది. లేకపోతే, ఆసుపత్రికి వేల సంఖ్యలో వచ్చిన గ్రామస్తులను అదుపు చేయడం మావల్ల అయ్యేది కాదు. చిన్నారి శ్వాసకోస సమస్యలతో ఇబ్బందిపడుతోంది" అని తెలిపారు.

శిశువు తండ్రి జమాల్ మియా మాట్లాడుతూ.. "తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. నా బిడ్డను చూసి, ఒక్కసారి ఆశ్చర్యపోయాను. నేను ‘అల్లా’కు కృతఙ్ఞతలు చెప్పుకుంటున్నాను. రెండు ముఖాలు, రెండు నోర్లు కదుపుతూ, రెండు ముక్కులతో గాలి పీలిస్తుండటం చూసి చాలా ఆశ్చర్యమేసింది. ఇదే సమయంలో మియా తన బాధను కూడా వ్యక్తం చేశాడు. ఒకవేళ తన భార్యకు, బిడ్డకు చికిత్స చేయించాల్సి వస్తే కనుక తన వద్ద నయా పైనా లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ లో 2008 లో కూడా ఇదే తీరులో ఉన్న రెండు తలల వింత శిశువు జన్మించినా.. ఎక్కువకాలం జీవించలేదని వైద్యులు తెలిపారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved