పాత్ టూత్ బ్రష్ ఉపయోగించే క్రియేటివ్ ఐడియాస్

టూత్ బ్రష్ మార్చినప్పుడల్లా.. పాత టూత్ బ్రష్ పడేస్తూ ఉంటాం. ఇలా ఎన్ని టూత్ బ్రష్ లు డస్ట్ బిన్ లో చేరుంటాయో కదూ. కానీ.. ఇకపై టూత్ బ్రష్ ని పడేయకుండా.. ఇంటి క్లీనింగ్ లో భాగం చేసుకోండి. ఇల్లు శుభ్రం చేసేటప్పుడు పాత టూత్ బ్రష్ మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. టూత్ బ్రష్ ని చాలా క్రియేటివ్ గా ఉపయోగించడం తెలిస్తే.. ఇంట్లోని వస్తువులను తళతళ మెరిపించవచ్చు. పాత టూత్ బ్రష్ ఉపయోగించుకునే క్రియేటివ్ ఐడియాస్ మీకోసం...

*ట్యాప్స్ చుట్టూ పేరుకున్న మురికి వదిలించడానికి పాత టూత్ బ్రష్ చక్కటి పరిష్కారం. టూత్ బ్రష్ ని వెనిగర్ లో ముంచి.. ట్యాప్ చుట్టూ రుద్దడం వల్ల మురికి పోయి.. కొత్తవాటిలా మెరుస్తాయి.

*షూస్ కి పేరుకున్న బురద, దుమ్ము, ధూళిని పాత టూత్ బ్రష్ తో ఈజీగా వదిలించవచ్చు.

*ఇక కంప్యూటర్ కీ బోర్డ్స్ లో ఎంత దుమ్ము ఉంటుందో చెప్పనక్కరలేదు. దాన్ని క్లీ చేసినా.. సందుల్లో ఇరుక్కున్న దుమ్ము మాత్రం బయటకు రాదు. కాబట్టి.. ఈసారి పాత టూత్ బ్రష్ సహాయంతో కీబోర్డ్ దుమ్ము వదిలించండి.

*దువ్వెనల్లో పేరుకున్న మురికి తొలగించడానికి కూడా పాత టూత్ బ్రష్ చక్కగా ఉపయోగపడుతుంది.

*మీ నగల్లో మురికి చేరుకుందా ? అయితే.. పాత టూత్ బ్రష్ తీసుకుని క్లీన్ చేసి చూడండి. కొత్తవాటిలా మెరిసిపోతాయి.

*అంతేకాదండోయ్.. మీ పెదాలపై ఉండే డెడ్ సెల్స్ తొలగించడానికి కూడా మీ పాత టూత్ బ్రష్ ఉపయోగించవచ్చు. బ్రష్ ని నీటిలో తడిపి.. పెదాలపై రుద్దడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

*చూశారుగా.. ఇకపై పాత బ్రష్ ని పడేయకుండా.. ఇంట్లో ఇన్ని వస్తువులను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించండి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved