ఈ పెద్దాయన వయసు 60 సం.లు. ఆయన ఓ సాధారణ రైతు. ఆయన నివాసం కర్నాటక రాష్ట్రంలోని షిమోగా దగ్గరలోని నరసిపురా అనే గ్రామం. అందరూ ఆయన్ని “ వైద్య మూర్తి “ అని పిలుస్తారు. ఆయన అసలు పేరు నారాయణమూర్తి. ప్రతి అదివారం, గురువారం తెల్లవారు జాము నుండీ అతని ఇంటి ముందు వివిధ వ్యాధులతో బాధపడే జనం క్యూ లైన్ లో నిలబడి వుంటారు. ఆయన ఒక ఆయుర్వేద వైద్యుడు, రోజుకి 600 నుండి 700 వరకు వివిధ రకాల రోగాలతో బాధ పడే రోగులను ఆయన పరీక్షించి 15 నుంచి 30 రోజులకు సరిపడా మందులను పూర్తి ఉచితంగా ఇస్తాడు. చిన్న చిన్న జబ్బుల నుంచీ గుండె కు సంబంధమైన రోగాల వరకు, ఏదైనా ఆయన నయం చేయగలడు. రోగుల బాధ ను విన్న తరువాత ఇవ్వవలసిన మందులు తయారుచేసి ఉచితంగా అందిస్తారు. ఈ మందుల తయారీ లో చెట్ల బెరడ్లు, కొమ్మలు, వేర్లు వాడతారు. వీటిని ఆయన స్వయంగా దగ్గరలోని అడవి లోనుంచి సేకరిస్తారు. ఆయన వైద్యం చివరి దశలో వున్న కాన్సర్, హృదయ, శ్వాస సంబంధ రోగాల తో బాధ పడుతున్న రోగుల జీవితాలో వెలుగునిచ్చే అశాజ్యోతి గా మారింది. 6 - 8 నెలల పాటు మందుల తో పాటు పథ్యం కూడా తప్పక పాటించాల్సి వుంటుంది. 25 ఏళ్లు గా ఆయన ఎవరి దగ్గర నుండి ఏ ప్రతిఫలం ఆశించకుండా, ఈ నిస్వార్థ సేవ చేస్తున్నారు. క్యాన్సర్, గుండె సంబంధ రోగాలకు రకరకాల పరీక్షలు , ఆపరేషన్ల పేరుతో లక్షలు మింగేసే ఆసుపత్రులున్న ఈ రోజుల్లో… ఏమీ ఆశించకుండా, కొన్ని వేల మందికి సహాయపడుతూ రోగుల బాధలను తీర్చే దేవుడయ్యాడు ఆయన. ఆది, గురు వారాల్లో ఉదయం 7 గంటల నుండి ఉచిత వైద్యం అందించబడుతుంది... ఎవరు ముందు వస్తే వారిని చూస్తారు, ఎటువంటి ముందస్తు అపాయింట్ మెంట్ అవసరం లేదు.

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved