బ్రతికున్న తల్లికి చితి పేర్చి..కాల్చేందుకు ప్రయత్నం..!

నవ మాసాలు మెసి ,కని , పెంచి పెద్ద చేసిన కన్నతల్లి పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నట్లు తనయుల గురించి నిత్యం వార్తలో వింటూనే ఉన్నాం..గతంలో తల్లిదండ్రుల మాటలకు కట్టుబడి, వారు చెప్పినట్టు నడుచుకునే సంతానం ఉండేంది.కాని ఇప్పుడు రెక్కలు రాగానే తల్లిదండ్రులను వదిలేసి ఎగిరిపోతున్నారు.కొంత మందైతే వృద్యాపంలో ఉన్న తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్దాశ్రమంలో పడేస్తున్నారు.

కాని ఓ తనయుడు అంటే కంటే ఘోరంగా ప్రవర్తించాడు..తన తల్లి బతికుండగానే..చితి పేర్చి కాల్చేసేందుకు ప్రయత్నించాడు..ఈ దారుణ ఘటన అనంతపురం కొత్త చెరువులో జరిగింది. ఆదే ప్రాంతంలో నివసించే నాగరాజు.. తన తల్లి ముసలి తల్లి బ్రతికుండగానే చాపలో చుట్టి స్మశానానికి తరలించాడు.చితి పేర్చి అమెకు దహనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా కోంతమంది గమనించి స్థానిక మీడియాకు సమాచారం అందించారు..

వెంటనే మీడియా ప్రతినిధులు స్మశానానికి వెళ్ళి ఆ తల్లిని రక్షించారు..అనంతరం పోలీసులకు సమాచారం అందించి..నాగరాజు వివరణ కోరారు..తన తల్లిని పోషించే సత్తా లేదని..స్వంత ఇల్లు కూడ లేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

పోలీసుల విచారణలో సైతం తనకు నరాల బలహీనత వ్యాధి ఉందని..తన సంపద తనను తాను పోషించుకోవడానికే సరిపోవడం లేదని.. అందుకే తప్పని సరిపరిస్థితులలో ఇలా చేయవలసి వచ్చిందని నాగరాజు తెలిపాడు..ఈ దారుణం పై కేసు నమోదు చేసిన పోలీసులు..నాగరాజు తల్లికి వైద్యం అసుపత్రికి తరలించారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved