పొట్ట తగ్గటం ఇంత సులువా..

పొట్టలో పేరుకుపోయిన కొవ్వు తగ్గాలంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి పొట్ట తగ్గడం కోసం చాలామంది తిండి తినడం మానేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా జంక్‌ఫుడ్‌ తినడాన్ని బాగా తగ్గించాలి. వీటిల్లో అధికపాళ్లలో సోడియం ఉంటుంది. ఇది శరీరానికి మంచిది కాదు.

ముఖ్యంగా రాత్రి పూట 10-11 గంటల సమయంలో తినడం చేయకూడదు

ఎప్పుడు నీళ్లు తాగినా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు తాగితే పొట్ట ముందుకు సాగదు పొట్ట తగ్గాలంటే అన్నాన్ని పూర్తిగా మానేసి రొట్టెల(పుల్కాలు)ను ఎక్కువ కూరతో అంటే మూడు వంతుల కూరతో తినాలి.

ఉత్తాన పాదాసనం, నౌకాసనం అనే ఈ రెండు ఆసనాలను రెండు పూటలా చేస్తే చాలా త్వరగా పొట్ట కరిగిపోతుంది

శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు, వాము, జిలకర్ర, సైంధవలవణం, సమభాగాలుగా చుర్ణించి మూడువేళ్ళకు వచ్చినంత చూర్ణాన్ని పావులీటర్ ఆవుమజ్జిగలో కలుపుకొని రోజూ రెండుపూటలా తాగుతుంటే లావుగావున్న ఊదరపొట్ట క్రమంగా తగ్గిపోతుంది.

రోజూ పరగడపున అలోవెరా జ్యూస్ తాగడం మంచిది. దీనివల్ల శరీరంలో కొవ్వు చేరకుండా ఉంది. ఇది తీసుకున్న అరగంట తర్వాత ఒక తాజా పండును తినండి చాలు.

గ్రీన్ టీ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు, రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.

బరువు తగ్గాలనుకున్నవారు రోజూ సుమారు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. దీనివల్ల మెటబాలిజమ్ రేట్ పెరిగి, అధిక బరువు పెరగకుండా కాపాడుతుంది. ఏది చేసినా కనీసం 3నెలలకు తగ్గకుండా చేయాలి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved