వాట్సాప్ ఇక ప్రపంచవ్యాప్తంగా ఉచితం

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ఇక ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా వాడుకోవచ్చు. ఏడాదికి వసూలు చేస్తున్న ఒక డాలరు ఫీజును రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ సోమవారం తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ఆదాయం కోసం థర్డ్ పార్టీల నుంచి ప్రకటనలను కూడా ప్రవేశపెట్టబోమని పేర్కొంది.

వాట్సాప్‌ను వాడుకున్న తొలి ఏడాది తర్వాత ఫీజు చెల్లించాలని కొంతమంది యూజర్లను అడుగుతున్నామని, అయితే తాము విస్తరించడంతో, అది అమల్లో సాధ్యం కావడం లేదని తేలినట్లు వెల్లడించింది. తమ యాప్‌కు సంబంధించిన వివిధ వెర్షన్లపై ఫీజును రానున్న వారాల్లో రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది యూజర్లు ఉన్న వాట్సాప్ భారత్‌లోని యూజర్ల నుంచి ఫీజు వసూలు చేయడం లేదు. కాగా, ప్రకటనల్లేకుండా తమ సర్వీసు అందించేందుకు కొన్ని టూల్స్‌ను పరీక్షిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. తమ యాప్ ద్వారా యూజర్లు వ్యాపారులతో, బ్యాంకులు తదితర సంస్థలతో సంప్రదింపులు నెరపడానికి టూల్స్‌ను ఈ ఏడాది నుంచి పరీక్షిస్తామని పేర్కొంది.

చాలామంది వద్ద క్రెడిట్ కార్డులు లేకపోవడం వల్ల ఆదాయం సమకూరడం లేదన్న ఉద్దేశంతో వాట్సప్ పూర్తిగా ఈ subscription ఛార్జీలను తొలగించబోతోంది. సో ఇక పూర్తి ఫ్రీ అన్నమాట. అయితే వాట్సప్‌కి ఆదాయం ఎలాగన్నది ప్రశ్న కదా.

బ్యాంకులు, ఎయిర్‌లైన్స్, ఇతర వ్యాపార సంస్థలు నేరుగా వాట్సప్ ద్వారా మీతో కమ్యూనికేట్ చేసే విధంగా మీ వివరాలను వాట్సప్ వారికి అందించబోతోంది. మీరు చేసే లావాదేవీలను పరిశీలించి.. మీరు ఏ వ్యాపార సంస్థతో లావాదేవీలు జరిపారో వారికి మీ వివరాలను వాట్సప్ అందించబోతోంది. అందుకుగాను ఆయా సంస్థల నుండి రుసుము వసూలు చెయ్యబోతోంది. ఇది యూజర్ల ప్రైవసీకి కొంత మేరకు భంగం కలిగిస్తుంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved