నెరిసే జుట్టును ఆపటం ఎలా?

జుట్టు నెరవటం సాధారణంగా వయసు మీరిన వాళ్ళలోనే కలుగుతుంది. కానీ కొందరిలో జనన లోపాలు లేదా కాలుష్యం మరియు ఇతరేతర కారణాల వలన పిన్న వయసు గల వారిలో కూడా జుట్టు రంగు మారుతుంది. జుట్టు నెరవటానికి గల కారణాలు మరియు వాటి వలన కలిగే సమస్యలకు తగిన సలహాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

ఉసిరి

ఉసిరికాయ జుట్టుకు మంచి చేసే చాలా రకాల కారకాలను కలిగి ఉంటుంది. బూడిద రంగు వెంట్రుకలు నివారించాలి అనుకుంటున్నారా? మీరు తీసుకునే ఆహారంలో ఉసిరికాయలను కలుపండి. కొన్ని ఉసిరికాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించండి. ఈ ముక్కలను కొబ్బరి నూనెలో కలిపి నల్లగా మారే వరకు వేడిచేయండి. వచ్చిన మిశ్రమాన్ని మీ జుట్టుకు పూయండి. ఈ విధంగా ఇంట్లోనే మీ జుట్టు బూడిద రండులోకి మారటాన్ని ఆపవచ్చు

కరివేపాకు

కరివేపాకు సహజ సిద్దమైన మూలకాలను కలిగి ఉంటాయి మరియు ఇవి జుట్టు వాటి నిజమైన రంగు పొందేలా చేస్తాయి. కరివేపాకు కొబ్బరి నూనెలో వేసి అవి నల్ల రంగులోకి మారే వరకు వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని మజ్జిగలో కలిపి మీ తలకు పూయండి ఇలా చేయటం వలన మీ తల వెంట్రుకలు తెల్లగా మారటాన్ని నివారిస్తుంది

పొగ త్రాగటాన్ని ఆపేయండి

వెంట్రుకలు త్వరగా రంగు మారటానికి కారణం కావలసిన సమయానికి ముందు గానే పక్వతకి గురవటం. పొగత్రాగటం, ఈ చెడు అలవాట్ల వలన శరీరం ఉన్న సమయానికి ముందుగానే తొందరగా పక్వానికి గురవుతుంది. దీని వలన జుట్టు రంగు మాత్రమే కాకుండా శరీరానికి సంబంధించిన ఇతర సమస్యలు కలుగుతాయి. కావున పోగత్రాగటానికి దూరంగా ఉండటం వలన జుట్టు రంగు కాకుండానే ఇతర రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు

ఒత్తిడి

జుట్టు రంగు మారటానికి ఒత్తిడి కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అధిక ఒత్తిడి వలన జుట్టు బూడిద రంగులోకి మారటం అనే ప్రక్రియ వేగవంతం అవుతుంది. జుట్టు రంగు మారకూడదు అనుకుంటే, ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఒత్తిడికి దూరంగా ఉండటం వలన మీ మానసిక స్థితి కూడా అదుపులో ఉంటుంది.

మెరుగైన జీవన శైలిని

మీరు అనుసరించే జీవన శైలి నేరుగా జుట్టుతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మెరుగైన జీవన శైలిని అనుసరిస్తూ జుట్టు బూడిద రంగులోకి మారటాన్ని నిలిపివేయండి. చిన్న చిన్న వ్యాయామలు చేస్తూ మరియు మంచి ఆహరాన్ని తీసుకోవటం ప్రారంభించండి. రోజు ఉదయాన నడవటం వలన చాలా రకాల ఉపయోగాలు కలుగుతాయి.

ఆరోగ్యవంతమైన ఆహరం తినండి

మీ జుట్టు, శరీరం ఆరోగ్యవంతంగా ఉండటానికి మంచి పోషకాలు తప్పని సరిగా అవసరం. మీ శరీరానికి మరియు జుట్టుకు కావలసిన పోషకాలను అందించే భాద్యత మీదే. ఆరోగ్యకరమైన ఆహరం అనగా మీరు తినే ఆహరంలో విటమిన్ 'A', విటమిన్ 'B', ఐరన్, అయోడిన్, కాపర్, ప్రోటీన్ మరియు జింక్ వంటి విటమిన్'లు, మినరల్స్ ఉన్న ఆహర పదార్థాలను తినాలి.

సున్నితంగా ఉండండి

మీ జుట్టు పట్ల సున్నితంగా వ్యవహరించండి. రోజు మీ జుట్టుని షాంపూతో కడగటం వలన జుట్టు రంగు మారటం ఒక కారణంగా చెప్పవచ్చు. అధిక గాడతలు గల షాంపూ వాడటం వలన ప్రోటీన్ ఉత్పత్తి పైన ప్రభావం చూపి, బూడిద రంగులోకి మారే అవకాశం ఉంది. మీ తల పైన ఉన్న చర్మంలో రక్త ప్రసరణ అధికం అవటానికి స్నానం చేసేటపుడు మీ చేతి వేళ్ళతో తలను మసాజ్ చేయండి. ఇలా చేయటం వలన రక్త ప్రసరణను అధికం చేయవచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved