ATM పిన్ 4 అంకెలే ఉండానికి కారణం…?

ఏటీఎం. ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతున్న ఈ సాధనం లేనిదే మనడైలీ జీవితం ముందుకు సాగదు. అయితే మనం ఉపయోగించుకుంటున్న ఏటీఎం పిన్ నంబర్ కేవలం 4 అంకెలే ఉంటాయి. ఆ పిన్ నెంబర్ ఎందుకు 4 అంకెలు ఉంటాయో మీరెప్పుడైనా ఆలోచించారా?అదే మన ఈమెయిల్, లేదా సోషల్ వర్కింగ్ సైట్స్ కైతే 6 లేదా అంతకంటే ఎక్కువ నెంబర్ లను పాస్ వర్డ్ గా ఉపయోగించుకుంటాం. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఈ పాస్ వర్డ్స్, పిన్ నెంబర్స్ ను మన భద్రత కోసం వాడతాం. అలాంటిది ప్రతి నిత్యం అవసరమయ్యే డబ్బుల కోసం ఇంకెంత పకడ్బందీగా ఉండాలి. ఇలా ఏటీఎం పిన్ నెంబర్ 4 అంకెలుగా ఉండటానికి ఒక కారణం లేకపోలేదు.

1967నుండి వాడకంలో ఉన్న ఏటీఎంలను స్కాట్ లాండ్ కు చెందిన జాన్ ఆడ్రియన్ షెపర్డ్ బార్ కనుగొన్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. ఆయన కనిపెట్టిన ఏటీఎం ల కంటే కొంచెం అడ్వాన్స్డ్ మిషన్సే ఇప్పుడు వాడకంలో ఉన్నాయి. జాన్ ఆడ్రియన్ కనిపెట్టిన ఈ మిషన్ లలో డబ్బును ఇతరులు తెలుసుకోకుండా ఉండేందుకు, సెక్యూరిటీ కోసం పిన్ నెంబర్ ని పెట్టాడట. మొదట పిన్ నెంబర్స్ ను 6 అంకెలుగా ఉండేలా ఫిక్స్ చేశాడు. అయితే అన్ని అంకెలు గుర్తుపెట్టుకోవడం కష్టమని, చాలామంది అన్ని నెంబర్స్ ని గుర్తుoచుకోవడం కష్టమని ఆండ్రియన్ భార్య వద్దని వారించిందట. ఆ తర్వాత నవ్వుతూ 4 అంకెల పిన్ నెంబర్ అయితే బెటర్ గా ఉంటుందని సూచించడంతో, 6 అంకెల పిన్ నెంబర్ ను కాస్తా 4 అంకెల పిన్ గా సెట్ చేశాడట. ఆండ్రియన్ భార్య చాలా సంతోషించిదట.అయితే చాలావరకు బ్యాంకులు 4 అంకెల పిన్ నెంబర్ ఇస్తున్నా, ఇంకొన్ని ఇతర బ్యాంకులు ఇప్పటికీ 6 అంకెల పిన్ నెంబర్ ని ఇస్తున్నాయట. ఎనీ వే మీ ఏటీఎం పిన్ ఎవరికీ చెప్పకండి. భద్రంగా గుర్తుపెట్టుకోండి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved