రాత్రిళ్లు పెరుగు ఎందుకు తినకూడదు..!

రాత్రిళ్లు పెరుగు తినవచ్చా? తింటే ఏమవుతుంది? చాలామందికి తెలియనిది ఏంటంటే పెరుగు కన్నా మజ్జిగ ఆరోగ్యానికి చాలా మంచిదని. కానీ పెరుగు తినటానికే అందరూ ఇష్టపడతారు. అయితే రాత్రిళ్లు తినవద్దని పెద్దలే కాదు డాక్టర్లు కూడా చెబుతారు అంటే..

రాత్రిళ్లు పెరుగుతినడం వల్ల కపం పెరుగుతుందట. దానివల్ల ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరి అనారోగ్యసమస్యలు వస్తాయి. అందుకే రాత్రిళ్లు పెరుగుతినవద్దంటున్నారు. అసలు రాత్రి పూటేకాదు పగలు కూడా భోజనంలో పెరుగు తినకుండా ఉండటమే మంచిదంటున్నారు.

పెరుగుకన్నా మజ్జిగ ఆరోగ్యానికి చాలామంచింది. మజ్జిగ తీసుకోవడం చాలా జబ్బులు దూరం అవుతాయి.

ఎక్కుళ్ళు వస్తున్నప్పుడు ఒక చెంచా మజ్జిగలో సొంఠి కలుపుకుని తాగితే ఉపశమనం కలుగుతుంది.

వాంతులయ్యేటప్పుడు మజ్జిగతోపాటు జాజికాయను గీసుకుని మజ్జిగలో కలుపుకుని సేవించండి.

వేసవికాలంలో ప్రతిరోజు రెండుసార్లు మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో వేంచిన జిలకర కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.

కాళ్ళ పగుళ్ళకు మజ్జిగ నుంచి తీసిన తాజా వెన్నను పూస్తే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Share to your friends

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved