పెన్ను మూతకు ఆ రంధ్రం ఎందుకు?

ప్లాస్లిక్ నమిలితే లేనిపోని రోగాలొస్తాయని పుస్తకాల్లో చదువుకుంటాం. కానీ అవే పుస్తకాలు చదివేటప్పుడు కొందరు యథాలాపంగానో, అలవాటుప్రకారమో.. పెన్ మూతలను నమిలేస్తుంటారు. తేలికగా తీసుకుంటాంకానీ ఇలా పెన్ లిడ్స్ నములుతూ అవి గొంతుకు అడ్డంపడి చనిపోయేవారి సంఖ్య ఏటా 100కు పైమాటే. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండాల్సింది! అయితే ఒక చిన్న మార్పు మానవాళికి.. మరీ ముఖ్యంగా పెన్ను మూతలు నమిలివారికి మేలు చేసింది.

పెన్ లిడ్ పై భాగంలో రంధ్రం ఎందుకుంటుంది? అనే ప్రశ్నకు సమాధానం కనిపెట్టడానికి ఏళ్లుగా సాగిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిడ్ పై భాగంలో ఉండే రంధ్రమే వాటిని నమిలేవారి ప్రాణాలు పోకుండా కాపాడుతోందని తేలింది. ప్లాస్టిక్ తో తయారైన పెన్ మూతను నోట్లో పెట్టుకుని నమిలేటప్పుడు.. ముక్కుకు అతి సమీపంలో ఉండటం వల్ల దానిలోని రసాయనాల ఘాడత శ్వాసకోశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దాంతో గాలిపీల్చుకోవటం కష్టమై చివరికి ఊపిరి ఆగే పరిస్థితి ఏర్పాడుతుంది. అదే లిడ్ కు రంధ్రం ఉండటంవల్ల ఇలాంటి ఇబ్బందులు ఉత్పన్నంకావు. 1991లో బిక్ అనే వ్యక్తికి వచ్చిన ఈ రంధ్రం ఐడియా ఎంతోమంది ప్రాణాలు కాపాడింది. సో.. థ్యాక్స్ టు బిక్ అండ్ ద హోల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ పెన్ లిడ్!


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved