దేవాలయానికి వెళ్ళేముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి.?

గుడికి బయలు దేరామంటే తప్పక స్నానము చేసి బయలు దేరుతాము. ఐనా గుడికి బయట కుళాయి వద్ద లేదా బావి వద్ద మళ్ళీ కాళ్ళు కడుక్కుని లోపలకి వెళతాము. దానికి కారణం స్నానము అయ్యాక, బయలుదేరుముందు చెప్పులు ధరిస్తాము.

కానీ ముందుగా గుడి బైట పాదరక్షలకు వదిలి, పంఛభూతాల్లో బకటైన భూమి పై నిలబడి, పంచభూతాలకు అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ, అపాదమస్తకమూ పరిశుభ్రం చేసుకోవడానికి, తొలుత రెండు కాళ్ళ వెనుక, ముందూ తడిచేలా కడుక్కుంటాము. మూడు సార్లు పుక్కిలించి నీటిని బయటకి వదలాలి. ‘దేవా.! శరీరమూ, వాక్కుకి మూల కారకమైన నాలుకా, నోరూ కూడా శుభ్రపరచుకుని నీ ముందుకు వచ్చి ప్రార్ధిస్తున్నాము. కాన మమ్ము దీవించు’ అని అర్ధం. అందుకే విధిగా దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళూ, నోరూ శుభ్రపరుచుకుని దర్శించుకోవాలి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved