భార్యలు చేయకూడని కొన్ని విషయాలు చూద్దాం

1. భర్తను గురించి ఎప్పుడు నలుగురిలో మాట్లాడకుండటం. మీ భర్తలో మీకే తెలిసిన భలహీనతలు ఉండొచ్చు వాటి గురించి మూడో వ్యక్తులకు చెప్పే ప్రయత్నం చేయకండి. చాల మంది స్త్రీలకు కుటుంభంలో చిన్న విషయం జరిగినా వెంటనే తల్లికో , తోబుట్టువుకో చెప్పుకుంటారు. అది అంతటితో ఆగితే సరి కాని వాళ్ళు సమయం చూసుకొని మీ భర్త దగ్గర ప్రస్తావించే ప్రయత్నం చేస్తారు. అది ప్రయివేట్ గా మాట్లాడితే సరి కాని కొద్ది మంది అందరి ముందు మాట్లాడి రచ్చ రచ్చ చేయడమో లేదా హేళన చేయడమో చేస్తే ఆయన పరువు పోతుంది.

2.ఆయన పరువే కదా పోనియ్ అని అనుకోకండి. ఆయన పరువు పొతే ఆయనతో పాటు మీది కూడా పోతుంది అన్న విషయం గుర్తుంచుకోండి.

3. ఎప్పుడు మీరు అది గుర్తు పెట్టు కోరు ఇది గుర్తు పెట్టుకోరు అని పదే పదే నిందించకండి. తన పనులతో పాటు ఇంటి విషయాలు కూడా చూడాలంటే కుదరకపోవచ్చు. గృహ సంభంద భాద్యతలలో పడి మర్చిపోవచ్చు అర్ధం చేసుకోండి.

4. మీ అవసరం కోసం, మీ కోరికల చిట్టా తెరవడానికి శృంగారాన్ని వాడకండి. మీ మీద ఏహ్య భావం కలిగే అవకాశం ఉంది.

5. మీ ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు ఎవరు సరిదిద్దుతారా అని ఏ వ్యక్తి గురించో , పుస్తకం గురించో వెతక్కండి. వాటివల్ల ఇంకా దూరం పెరిగే అవకాశం ఉంది. మీకు ఆ విషయమై పశ్చాతాపం ఉంటే మీరే ముందు క్షమాపణ చెప్పండి. మీ తప్పు కాక మీ సహచారుడిదే తప్పైతే ఆయనకు ఏమి జరిగింది ఎలా జరిగిందో ఒక ఉత్తరం రాయండి.

6. ఎక్కువ మంది భార్యలు భర్తలను తిట్టేది డబ్బు విషయం దగ్గరే. తిట్టి కసురుకునే కన్నా అతనితో కూర్చోండి అతనికి తెలియకుండా ఒక నెల ఒక డ్రాఫ్ట్ తయారు చేసి చూపించి మీ మార్గంలో అయితే మీరేమి చేసేవారో చెప్పి అతన్ని ఒప్పించే ప్రయత్నం చేయండి.

7. మీ ఇద్దరు మాట్లాడుకునేప్పుడో , లేదా బయట వారు అంటే మీ స్నేహితులో చుట్టాలో ఇంటికి వచ్చినప్పుడు అతని మాటలు కూడా మీరే మాట్లాడకండి. మీ భర్తను కూడా మాట్లాడనీయండి. అతని నోరు మీరయ్యే పరిస్థితి కలిగితే బయటివారి ముందు అతను చులకన అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

8.మీరు మైండ్ రీడర్ లాగా ప్రవర్తించకండి. తను చెప్పాలనుకున్నది మీరనుకున్నది కాదేమో. మీరే ముందు మైండ్ రీడర్ లాగా గెస్ కొడుతూ మాట్లాడితే ఆయనకు మీతో పంచుకోవాలి అని అనిపించిన విషయం కూడా చెప్పాలని పించదు.

9. మీ భర్తే కాదు , ఏ మనిషి కూడా మైండ్ రీడర్ కాదు. మీకు ఏదైనా కావాల్సివచ్చిన , ఏదైనా చెప్పాలనుకున్న పంచుకోండి. అతడు ఇలా చేస్తాడో లేదో చూద్దాం అని మీతో మీరే పోటి పెట్టుకోకండి. మనుషులు భవిష్యత్తును తెలుసుకునే దేవతలు కారు.

10. ఎప్పుడైనా బయటి విషయాలు ఒత్తిడి వల్ల మీ భర్త చాలా కోపంగా ఉంటే అతన్ని కదిలించకండి. అతను నిమ్మలించే వరకు అతన్ని అలా వదిలేయండి. లేదంటే ఆ కోపం మీపై చూపించేస్తే మీరు హర్ట్ అవుతారు.

11. మీ భర్త బంధువుల గురించిన తప్పుడు మాటలు , వాళ్ళపై లేనిపోనివి చెప్పకండి మీ మీద నమ్మకం పోయే ప్రమాదముంది.

12. ఒక మంచి పని గురించి ఆలోచిస్తూ మీ సలహా అడిగినప్పుడు మీరిలా కాదు ఇలా చేయండి అని మీకు తెలిసిన విషయమైతే మీ నేర్పు ప్రదర్శించి అతన్ని నొప్పించకండి. మంచి స్నేహితురాలిలా మెత్తగా తెలుసుకునేలా చెప్పండి. ఇది మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటాను.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved