సృజనాత్మకంగా విండోస్ 10

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అందుబాటులోకి వచ్చేసింది. సరికొత్త ఫీచర్లు, అప్లికేషన్లతో వచ్చిన ఈ ఔస్‌ను వినియోగించేందుకు కస్టమర్లు ఎగబడుతున్నారు. బుధవారంనాడిక్కడ జరిగిన సమావేశంలో విండోస్‌ 10 ఔస్‌తో కూడిన పర్సనల్‌ కంప్యూటర్లు, టాబ్లెటను ప్రదర్శించారు. వీటిలోని ఫీచర్లను వినియోగించేందుకు వినియోగదారులు క్యూకట్టారు. ప్రస్తుతం జెన్యూన్‌ విండోస్‌ 7, విండోస్‌ 8.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌లను కంప్యూటర్లో, టాబ్లెట్లలో వాడుతున్న వారు ఉచితంగానే విండోస్‌10కు అప్‌గ్రేడ్‌ కావొచ్చు. ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కస్టమర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్‌ ఇండియా చైర్మన్‌ భాస్కర్‌ ప్రామాణిక్‌ పేర్కొన్నారు. విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అంతర్జాతీయంగా 190 దేశాల్లో అందుబాటులోకి వచ్చిందని, ఉచితంగా ఈ ఔస్‌కు అప్‌గ్రేడ్‌ కావొచ్చన్నారు. ఈ ఔస్‌లోని కార్టానా, ఎక్స్‌బాక్స్‌, మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ వంటి నూతన ఆవిష్కరణల ద్వారా వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved